- Telugu News Photo Gallery Business photos Every month Rs 1500 Investment, You Can Get Rs 5 Lakhs After 15 Years In This Post Office Scheme
Post Office Scheme: అద్దిరిపోయే స్కీం.! ప్రతీ నెలా రూ. 1500 పెట్టుబడితో.. చేతికి రూ. 5 లక్షలు
సంపాదించిన సొమ్ములో కొద్దిమేరకు పొదుపు చేస్తే.. భవిష్యత్తు అవసరాలకు అస్సలు లోటుండదు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి అయితే లాభాలు వస్తాయి. కానీ రిస్క్ ఎక్కువ. అయితే రిస్క్ లేకుండా భద్రతతో కూడుకున్న రిటర్న్స్ కావాలంటే..
Updated on: Sep 10, 2024 | 6:15 PM


పోస్టాఫీస్ పథకాల్లో అధిక వడ్డీని ఇచ్చే పధకాల్లో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో పెట్టుబడి పెడితే.. ఇన్వెస్ట్మెంట్‌పై 7.1 శాతం వడ్డీ వస్తుంది. ఈ పథకంలో 15సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా 5 సంవత్సరాల చొప్పున మెచ్యూరిటీ డేట్ పెంచుకుంటూ పోవచ్చు.


ఈ పధకంలో 5 లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.18,000 అవుతుంది. ఇలా 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. మొత్తం రూ. 2,70,000 జమ అవుతుంది.

ప్రస్తుతమున్న 7.1 శాతం వడ్డీ రేటుతో చూస్తే.. మీకు ఆదాయంపై 2,18,185 వడ్డీ లభిస్తుంది. జమ అయిన మొత్తంతో పాటు వడ్డీని కలుపుకుంటే.. మొత్తం రూ. 4,88,185 మీ సొంతమవుతుంది. అంటే దాదాపుగా రూ. 5 లక్షలు మీ చేతికి రూ. 5 లక్షలు వస్తాయి. అధిక ఆదాయం కోసం ఈ పధకాన్ని మరికొన్ని ఏళ్లు పొడిగించుకోవచ్చు.




