AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naatu Naatu Song: నాటు నాటు అంటూ అందంగా చెప్పిన ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా ?..

నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రకటిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ కూడా నెటిజన్లను ఆకర్షించింది. దీంతో ఆమె ఎవరు అంటూ ఆరాలు తీస్తున్నారు.

Naatu Naatu Song:  నాటు నాటు అంటూ అందంగా చెప్పిన ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా ?..
Rrr Movie
Rajitha Chanti
|

Updated on: Jan 13, 2023 | 6:37 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ నటనతో భారతీయులనే కాదు.. విదేశీయులను సైతం ఫిదా చేశారు. అంతేకాకుండా.. కలెక్షన్స్ విషయంలోనూ ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ. 1200 పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పటి వరకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుని..ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. అయితే ఇటీవలే సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ గోల్డ్ అవార్డు అందుకుని మరో తెలుగు ఖ్యాతిని విశ్వవేదికపై నిలబెట్టింది. ఈ అవార్డ్ అందుకోవడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దేశమంతా ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఆ అవార్డ్ ప్రకటిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో అవార్డ్ ప్రకటిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ కూడా నెటిజన్లను ఆకర్షించింది. దీంతో ఆమె ఎవరు అంటూ ఆరాలు తీస్తున్నారు.

నాటు నాటు పాటకు గోల్డె్న్ గ్లోబ్ అవార్డ్ ప్రకటించిన ఆ అమ్మాయి పేరు జెన్నా ఆర్టెగా. ఆమె హాలీవుడ్ నటి.. పలు చిత్రాల్లో… టీవీ షోలలో నటించి ఆకట్టుకుంది. వెడ్నెస్ డే అనే టెలివిజన్ సిరీస్ కు గానూ ఉత్తమ నటిగా నామినేట్ అయ్యింది. కానీ విజేతగా నిలవలేదు. ఈమె 2002 సెప్టెంబర్ 27న కొచెల్లా వ్యాలీ.. కాలిఫోర్నియాలో జన్మించింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన జెన్నా.. ఆ తర్వాత జానే ది వర్జిన్ అనే వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఆ తర్వాత 2013లో విడుదలైన ఐరన్ మ్యాన్ -3లో దేశ ఉపాధ్యక్షుడి కుమార్తె పాత్రలో కనిపించి వెండితెరకు పరిచయమైంది. అలాగే డిస్నీ ఛానల్లో వచ్చిన స్టక్ ఇన్ ద మిడిల్ సిరీస్ తో పాపులర్ అయ్యింది. అలాగే ఎలెనా ఆఫ్ అవతార్ కు గానూ ఇమేజిన్ అవార్డ్ అందుకుంది. ఇవే కాకుండా.. ఆమె నటనకు ఎంటీవీ మూవీ, టీవీ అవార్డ్స్ సొంతం చేసుకుంది. అటు నటిగానే కాకుండా సామాజిక సేవలోనూ ముందుంటుంది జెన్నా. 2016లో క్యాన్సర్ బాధిత బాలికను కాపాడడం కోసం అభిమానుల నుంచి విరాళాలు సేకరించింది. ఈమె ఫుట్ బాల్ క్రీడాకారిణి కూడా. ప్రస్తుతం ఆమె ఫైనెస్ట్ కైండ్, స్క్రీమ్ 6, మిల్లర్స్ గర్ల్, వింటర్, స్ప్రింగ్, సమ్మర్ ఆర్ ఫాల్ చిత్రాల్లో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Jenna Ortega (@jennaortega)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.