Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Desamuduru: బ్లాక్ బస్టర్ దేశ ముదురు మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో బన్నీ స్టైల్, యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హన్సిక మోత్వానీ. ఈ సినిమాలో హన్సిక అందానికి, క్యూట్ నెస్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.

Desamuduru: బ్లాక్ బస్టర్ దేశ ముదురు మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
Deshamuduru
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 13, 2023 | 4:17 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీస్ లో దేశముదురు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో బన్నీ స్టైల్, యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హన్సిక మోత్వానీ. ఈ సినిమాలో హన్సిక అందానికి, క్యూట్ నెస్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. 2007లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 2007న 400 థియేటర్లలో విడుదలై భారీగా వసూల్ లు రాబట్టింది దేశముదురు. ఇక దేశముదురు సినిమాలో సీనియర్ హీరోయిన్ రంభ స్పెషల్ సాంగ్ లో మెప్పించారు. అల్లు అర్జున్ ఈ మూవీలో సిక్స్ ప్యాక్ తో అదరగొట్టాడు.

దేశముదురు సినిమాకు చక్రి అందించిన సంగీతం సినిమాను వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలిచింది. అలాగే డైరెక్టర్ పూరిజగన్నాథ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి ఇక ఈ సినిమాలో ముందుగా అల్లు అర్జున్ ను హీరోగా అనుకోలేదట.

డైరెక్టర్ పూరీ ముందుగా ఈ సినిమా కథను అల్లు అర్జున్ కోసం రాసుకోలేదట. అల్లు అర్జున్ కంటే ముందు ఈ కథను అక్కినేని హీరో సుమంత్ కోసం రాశారట. అయితే ఈ కథను విన్న తర్వాత సుమంత్ కు నచ్చలేదట. దాంతో ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఆ తర్వాత అదే కథను అల్లు అర్జున్ కు చెప్పగానే ఓకే చెప్పారట. అలా దేశముదురు సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అల్లు అర్జున్.Sumanth