AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాలు మానేసి వ్యవసాయం.. ఆ బాధ తట్టుకోలేక పల్లెటూరిలో గడిపేస్తున్న నటి

సినిమా ప్రపంచంలో అందం, అభినయంతో కట్టిపడేసిన తారలు చాలా మంది ఉన్నారు. ఒక్క సినిమాతోనే ఊహించని ఫాలోయింగ్ సంపాదించుకుని.. ఆ తర్వాత వరుస చిత్రాలతో మెప్పించిన ముద్దుగుమ్మల గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో జనాల హృదయాలు గెలుచుకున్నవారు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

సినిమాలు మానేసి వ్యవసాయం.. ఆ బాధ తట్టుకోలేక పల్లెటూరిలో గడిపేస్తున్న నటి
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 02, 2026 | 3:52 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు కొదవే లేదు.. చాలా మంది అందాల తారలు సినిమాల్లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. కొంతమంది ఇలా వచ్చి అలా మాయం అవుతుంటే మరికొందరు మాత్రం వరుస సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. ఇక సినిమాల నుంచి దూరంగా ఉంటున్న వారు పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరికొందరు ఇతర బిజినెస్ లతో బిజీగా ఉన్నారు. కానీ ఓ నటి మాత్రం ఊహించని విధంగా వ్యవసాయం వైపు అడుగులేసింది. సినిమాలు వదిలేసి ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా గడిపేస్తుంది ఓ అందాల భామ. అడపాదడపా స్క్రీన్ పై సందడి చేస్తున్నా పూర్తి సమయం ఊర్లో వ్యవసాయం కోసమే కేటాయిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదివేయండి : అందంలో అమ్మను మించిపోయిన రోజా కూతురు.. కోరికల చిట్టా విప్పిన అన్షు మాలిక

ఈ ఆ అందాల హీరోయిన్ గతకొన్నేళ్ళుగా వ్యవసాయం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తుంది. ఆమె పేరు రతన్ రాజ్ పుత్. బీహార్ లో పుట్టిపెరిగిన ఈ అమ్మడు టెలివిజన్ నటి పాత్రమే కాదు బ్లాగర్ కూడా.. ఆమె బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ‘అగలే జనమ్ మోహే బిటియా హి కిజో’ అనే బిరుదుతో ప్రజలకు మరింత దగ్గరయ్యింది. అలాగే 2013లో, ఆమె రియాలిటీ షో బిగ్ బాస్ 7 పాల్గొని 28వ రోజున ఎలిమినేట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆమె నటనను వదిలేసింది. సీరియల్స్ తో పాటు, రతన్ టీవీలో తన సొంత షోను సృష్టించింది. చివరిగా సంతోషి మా సీరియల్లో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేయండి : RGV: ఇదేందయ్యా..! ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.? అది కూడా ఓ గుడిలో

అదే సమయంలో డిప్రెషన్ కారణంగా ఆమె నటన వృత్తిని వదులుకుంది. 2018లో రతన్ తండ్రి మరణించారు. దీంతో ఆమె ఆ దుఃఖాన్ని భరించలేకపోయింది. నెమ్మదిగా డిప్రెషన్ భారిన పడింది. తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉండిపోయిన ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. నటన మానేసి ప్రశాంతమైన జీవితాన్ని ఎంపిక చేసుకుంది. 2020లో లాక్డౌన్ తరువాత, ఆమె తన యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించింది. ఊర్లో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తుంది. అయితే తన తండ్రి చనిపోయిన బాధనుంచి బయటకు రావడం కోసం మానసిక వైద్యుడితో మాట్లాడి ముంబై వదిలి తన గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకుంది. అక్కడ ఆమె గ్రామస్తులతో కలిసి వ్యవసాయం చేయడం ప్రారంభించింది. సోషల్ మీడియాకు కూడా ఆమె మెల్లగా దూరం అయ్యింది. ఒకప్పుడు వారుగా వీడియోలు పోస్ట్ చేసిన ఆమె ఇప్పుడు అవి కూడా తగ్గించేసింది.

ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us