AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya : సూర్య, మహేష్ బాబుకు మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏంటో తెలుసా.. ? సినిమాల్లోకి రాకముందే అనుబంధం..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీకి అడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ చిత్రాన్ని తమిళంలో విశ్వనాథన్ అండ్ సన్స్ పేరుతో, తెలుగుతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషలలో విడుదల చేశారు.

Suriya : సూర్య, మహేష్ బాబుకు మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏంటో తెలుసా.. ? సినిమాల్లోకి రాకముందే అనుబంధం..
Suriya, Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Sep 04, 2026 | 7:35 AM

Share

దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు సూర్య. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, నటనలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపే సూర్య, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాలతో తనకు ఉన్న ప్రత్యేక బంధాన్ని , పాఠశాల రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు. సూర్య తెలిపిన వివరాల ప్రకారం, సూపర్ స్టార్ మహేష్ బాబు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, హీరో కార్తి , సూర్య అందరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వీరందరూ చెన్నైలోని ప్రముఖ సెయింట్ బెడ్స్ పాఠశాలలో విద్యను చదువుకున్నారు. మహేష్ బాబు తనకు క్లాస్‌మేట్ అని సూర్య ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : 2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..

చిన్ననాటి నుంచి ఒకరికొకరు తెలుసని, తమ మధ్య సుమారు 18 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన ప్రయాణం , అపరిమితమైన జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాతో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా సూర్య ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. యువన్ చిన్నతనంలో కుర్చీపైకి ఎక్కి పియానో వాయించే రోజుల నుంచి ఆయనను చూస్తున్నానని సూర్య అన్నారు. తన సినీ కెరీర్ ప్రారంభంలో యువన్ ఇచ్చిన అద్భుతమైన సంగీతం వల్ల తనకు మంచి బ్రేక్ లభించిందని, ఆయన సంగీతానికి తాను పెద్ద అభిమానని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Yeshanagula : . ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‏కు అర్థం ఇదే..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో వేర్వేరు భాషల్లో అగ్ర నటులుగా, సంగీత దర్శకులుగా కొనసాగుతున్నప్పటికీ, తమ చిన్ననాటి స్నేహం , పరస్పర గౌరవం ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయని సూర్య పేర్కొన్నారు. ఒకే పాఠశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఈ రోజు చిత్రసీమలో ఉన్నత స్థానాల్లో రాణిస్తూ, మళ్లీ కలసి పనిచేస్తుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..

Follow Us
తెల్ల జుట్టుకు హెన్నా పెట్టడం మానలేకపోతున్నారా?.. ఇది తెలుసుకోండి
తెల్ల జుట్టుకు హెన్నా పెట్టడం మానలేకపోతున్నారా?.. ఇది తెలుసుకోండి
అరెరే కళ్లలో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడం ఇంత సింపులా
అరెరే కళ్లలో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడం ఇంత సింపులా
ఓటీటీలో దుమ్మురేపుతున్న 8 ఎపిసోడ్స్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న 8 ఎపిసోడ్స్..
భారత్‌లో మారుతున్న యువత ఆలోచనలు.. ఉద్యోగం కంటే సొంత బిజినెస్‌పైనే
భారత్‌లో మారుతున్న యువత ఆలోచనలు.. ఉద్యోగం కంటే సొంత బిజినెస్‌పైనే
పిండి కలిపేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. చపాతీలు సాయంత్రం వరకు
పిండి కలిపేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. చపాతీలు సాయంత్రం వరకు
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జంబ్లింగ్ విధానంపై ఇంటర్ బోర్డు
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జంబ్లింగ్ విధానంపై ఇంటర్ బోర్డు
తెలుగు సినిమాల్లో మార్పు రావాలి.. వాటిని ఆపేయాలి - హీరో నిఖిల్
తెలుగు సినిమాల్లో మార్పు రావాలి.. వాటిని ఆపేయాలి - హీరో నిఖిల్
చలికాలంలో ఉసిరి క్యాండీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?  
చలికాలంలో ఉసిరి క్యాండీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?  
పదేపదే వాట్సాప్ డీపీ మార్చేవారి మనస్తత్వం ఇలాగే ఉంటుందా?
పదేపదే వాట్సాప్ డీపీ మార్చేవారి మనస్తత్వం ఇలాగే ఉంటుందా?
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. పిడుగుల హెచ్చరిక!
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. పిడుగుల హెచ్చరిక!