Krithi Shetty: హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వక ముందు కృతిశెట్టి ఏం చేసేదో తెలుసా..
తొలి సినిమాతోనే బిగ్ హిట్ అందుకుంది కృతి. ఉప్పెన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది కృతి. ఉప్పెన సినిమా తర్వాత కృతికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.
ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మంగుళూరు భామ కృతి శెట్టి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే బిగ్ హిట్ అందుకుంది కృతి. ఉప్పెన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది కృతి. ఉప్పెన సినిమా తర్వాత కృతికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి సెకండ్ సినిమాలో ఏకంగా లిప్ లాక్ తో షాక్ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య, నాగార్జున కలిసి నటించిన ఈ బంగార్రాజు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి. ఆతర్వాత వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
నితిన్, సుధీర్ బాబు, రామ్ పోతినేని లతో చేసిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ మూడు సినిమాల తర్వాత చిన్న గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత నాగ చైతన్యతో కలిసి మరోసారి కస్టడీ సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
ఇదిలా ఉంటే కృతి హీరోయిన్ అవ్వకముందు కూడా డబ్బులు బాగానే సంపాదించిందట. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకు ముందు పలు యాడ్స్ లో నటించిందట కృతి. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ గా స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఎక్కువగా యాడ్స్ లో నటించడం లేదట కృతి. హీరోయిన్ గా ఆఫర్స్ అందుకోవడం పైనే ఈ అమ్మడు దృష్టి పెట్టిందట ఈ భామ.