
ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డే్ట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి.ఈ సినిమాతోపాటు.. విజయ్ చేతిలో మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. తన సొంత క్లాత్ బ్రాండ్ RWDY ఉత్పత్తులను సైతం ప్రమోట్ చేస్తున్నాడు.
ఎప్పుడూ సింపుల్ అండ్ స్టైలీష్‌గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు విజయ్. సాధారణ ఎయిర్ పోర్ట్ లుక్ అయినా.. ఈవెంట్లలో అయిన విజయ్ స్టైల్, ఫ్యాషన్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటాయి. ఇక ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గురువారం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు రౌడీ హుడీలో కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
మొజాయిక్ ప్యాచ్‌లతో సెట్ చేసిన చిక్ ఆఫ్ వైట్ హుడీతోపాటు.. లగ్జరీ బ్రాండ్ గివెన్చీ గాగూల్స్ ధరించాడు. సెలబ్రెటీ అవుట్ ఫిట్స్ డీకోడ్ అనే ఇన్ స్టా పేజీ ప్రకారం.. విజయ్ ధరించిన స్టైలిష్ గాగుల్స్ ధర రూ.1.58 లక్షలు. కేవలం గాగుల్స్ లక్షకు పైగా ఉండడమేంటనీ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం విజయ్ న్యూలుక్.. స్టైలిష్ గాగుల్స్ ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. విజయ్, మృణాల్ జంటగా నటిస్తోన్న ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్పెషల్ రోల్ పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఢిల్లీలో జరిగిన ఈ మూవీ షూటింగ్ లో రష్మిక పాల్గొందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.