Tollywood: సౌత్ ఇండియా బ్యూటీ ఈ అమ్మాయి.. ఫాలోయింగ్ మాములుగా ఉండదు.. ఎవరో గుర్తుపట్టారా ?..
రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, సమంత ఇలా స్టార్స్ అందరి చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలయ్యాయి. ఇప్పుడు అలాంటి ఓ చిత్రమే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన తల్లిదండ్రుల మధ్య యువరాణిలా నిల్చొన్న ఈ అమ్మాయి ఇప్పుడు సౌతిండియాలో హీరోయిన్. కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. నిజానికి ఈ అమ్మాయి కేరళకు చెందిన బ్యూటీ.. కానీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎవరో గుర్తుపట్టారా ?..

సినీతారల చిన్ననాటి విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ప్రపంచంలో తమ అభిమాన తారల వ్యక్తిగత విషయాల గురించి.. వారి చిన్ననాటి విషయాలపై ఎక్కువగా చర్చిస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా నెట్టింట త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ ఎంతగా వైరలవుతుందో తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీస్ చైల్డ్ హుడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, సమంత ఇలా స్టార్స్ అందరి చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలయ్యాయి. ఇప్పుడు అలాంటి ఓ చిత్రమే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన తల్లిదండ్రుల మధ్య యువరాణిలా నిల్చొన్న ఈ అమ్మాయి ఇప్పుడు సౌతిండియాలో హీరోయిన్. కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. నిజానికి ఈ అమ్మాయి కేరళకు చెందిన బ్యూటీ.. కానీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ హనీరోజ్.
మలయాళంలో డైరెక్టర్ వినయనేర దర్శకత్వం వహించిన ‘బాయ్‌ఫ్రెండ్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత త్రివేండ్రం లాడ్జ్, కనల్, అహం రావ్, గాడ్స్ ఓన్ క్లీటస్, చంక్స్, యు టూ బ్రూటస్, ఇట్టిమణి: మేడ్ ఇన్ చైనా, బిగ్ బ్రదర్ చిత్రాల్లో నటించి అలరించింది. హనీ రోజ్ ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి సినిమాలో కథానాయికగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
View this post on Instagram
అయితే వీరసింహారెడ్డి సినిమా తర్వాత తెలుగులో హానీకి ఇప్పటివరకు మరో అవకాశం రాలేదు. కానీ ఎక్కువగా షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈబ్యూటీ. అటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం ఆమె రేచెల్’ చిత్రంలో నటిస్తుంది. అబ్రిడ్ షైన్ పోషించిన ఈ చిత్రంలో హనీ విభిన్నమైన పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు అనంతిని బాల దర్శకత్వం వహించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.