
విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్నా.. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో వీరిద్దరి పేర్లు మారుమోగుతున్నాయి. ఇటీవలే ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి సన్నిహితుల మధ్యలో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అక్టోబర్ 3న ఉదయం విజయ్ నివాసంలో ఈ వేడుక జరిగిందని సమాచారం. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అలాగే తమ గురించి వస్తున్న ఈ రూమర్స్ పై విజయ్, రష్మిక స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్, గీతా గోవిందం వంటి చిత్రాల్లో నటించారు.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
ఆ తర్వాత ఇద్దరి పరిచయం ప్రేమగా మారిందని. కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం నడుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి ప్రేమ గురించి ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. దీంతో ఇప్పుడు విజయ్, రష్మిక పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదుంది. అలాగే చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో హిట్ అందుకున్న విజయ్. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
నివేదికల ప్రకారం రష్మిక ఆస్తుల విలువ రూ.66 కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే విజయ్ ఆస్తులు రూ.70 కోట్లకు పైగానే ఉన్నట్లు టాక్. ఇద్దరి ఆస్తులు చూసుకుంటే రూ.136 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల నుంచి కాకుండా వ్యాపారాలు, ఎండార్స్‌మెంట్‌లు ద్వారా ఇద్దరు ఎక్కువగానే సంపాదిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ఫ్యాషన్ లేబుల్ రౌడీ వేర్ బిజినెస్ చేస్తుండగా.. రష్మిక పర్ఫ్యూమ్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?