
ప్రస్తుతం సినీరంగంలో స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే అటు వ్యాపార రంగాల్లోనూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. కానీ మీకు తెలుసా.. ఓ సీరియల్ నటి ఇప్పుడు స్టార్ హీరోలను మించిన ఆస్తులు సంపాదించిందట. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సీరియల్స్ ద్వారా అలరిస్తున్న ఆమె.. ఫైనాన్షియల్ గా సక్సెస్ అయ్యిందట. ఆమె మరెవరో కాదు.. సాక్షి తన్వర్. ఈ పేరు చెబితే తెలుగు అడియన్స్ అంతగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ నార్త్ మూవీ లవర్స్ మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. హిందీలో ఫేమస్ అయిన కహానీ ఘర్ ఘర్ కీ, బడే అచ్చే లగ్దే హై వంటి సీరియల్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరయ్యింది.
అయితే ఇప్పుడిప్పుడే సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. అయితే సాక్షి కో స్టార్ రామ్ కపూ్ ప్రకారం.. ఆమె ఏకంగా ఆరు తరాలకు సరిపడా డబ్బు సంపాదించిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ కపూర్ మాట్లాడుతూ.. “ఆమె ఆరు తరాలకు సరిపడా డబ్బు సంపాదించింది” అని అన్నారు. డబ్బు విషయంలో ఆమె జాగ్రత్తగా వ్యవహరించడాన్ని ప్రశంసించారు. షోబిజ్‌లోని చాలా మందిలా కాకుండా, సాక్షి ఆడంబరమైన కార్లు, అనవసర ఖర్చులను తగ్గించి.. తెలివిగా పెట్టుబడి పెట్టడానికే ఇష్టపడుతుందని.. దశాబ్దాల విజయం ఉన్నప్పటికీ ఆమె సింపుల్ లైఫ్ స్టైల్ ఇష్టపడుతుందని అన్నారు.
ఆమె సీరియల్స్, సినిమాల ద్వారా వచ్చే పారితోషికాన్ని మంచి పెట్టుబడులు పెడుతుందని అన్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో జన్మించిన సాక్షి ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె తండ్రి రిటైర్డ్ సిబిఐ అధికారి. సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన సాక్షి.. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ భార్యగా కనిపించింది. నెట్ ఫ్లిక్స్ లో మై: ఎ మదర్స్ రేజ్ వంటి డిజిటల్ షోలలో కనిపించి ప్రశంసలు అందుకుంది.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..