AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బాబోయ్.. IPL ద్వారా కోట్లు సంపాదిస్తోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఏం చేస్తుందో తెలుసా.. ?

ఒకప్పుడు సినీపరిశ్రమను ఏలేసింది. తెలుగు, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు IPLలో భారీగా సంపాదిస్తుంది. ఇంతకీ ఆమె ఏం చేస్తుందో తెలుసా.. ?

Tollywood: బాబోయ్.. IPL ద్వారా కోట్లు సంపాదిస్తోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఏం చేస్తుందో తెలుసా.. ?
Actress
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2025 | 7:16 AM

Share

దక్షిణాది సినీరంగంలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైన ఈ అమ్మడు ఇప్పుడు IPL క్రికెట్ లో కోట్లు సంపాదిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ ప్రీతి జింటా. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా చిత్రంలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అలాగే తెలుగులో మహేష్ బాబు జోడిగా రాజకుమారుడు చిత్రంలో నటించింది. తెలుగు, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైన ప్రీతి జింటా.. ఇప్పుడు IPL క్రికెట్ లో కోట్లు సంపాదిస్తుంది. ప్రీతి జింటా జట్టు పంజాబ్ కింగ్స్ ‘ఐపీఎల్ 2025’ చివరి రౌండ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసింది. ఐపీఎల్ క్వాలిఫయర్ 2 రౌండ్‌లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్.. RCB తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా సహయజమాని. నివేదికల ప్రకారం ఈ హీరోయిన్ ఆస్తులు రూ.183 కోట్లు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రీతి జింటా.. వ్యాపారం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా సంపాదిస్తుంది.

ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం ఆమె రూ.1.5 కోట్లు వసూలు చేస్తుంది. 2008లో ప్రీతి జింటా ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు సహ యజమాని అయ్యారు. ఆ సమయంలో ఆమె రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టిందట. ఇప్పుడు అది దాదాపు రూ.350 కోట్లకు చేరుకుంది. 2008లో పంజాబ్ కింగ్స్ ప్రారంభమైనప్పుడు దానిని $76 మిలియన్లకు కొనుగోలు చేశారు. 2022 నాటికి, దాని విలువ $925 మిలియన్లకు పెరిగింది. ఐపీఎల్‌లో టిక్కెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో ఐపీఎల్ జట్టు యజమానులు కూడా వాటా పొందుతారు. మీడియా నివేదికల ప్రకారం, టికెట్ల అమ్మకాలలో 80 శాతం జట్టు యజమానులకే వెళ్తాయి. జట్టు స్పాన్సర్‌షిప్‌ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు. ప్రీతి జింటా ప్రస్తుతం తన భర్త జీన్ గూడెనఫ్, ద్దరు పిల్లలతో బెవర్లీ హిల్స్‌లో నివసిస్తుంది. ఆమె వద్ద రూ.12 లక్షల విలువైన లెక్సస్ ఎల్ఎక్స్ 400 క్రాస్ఓవర్, పోర్స్చే, మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ (రూ.58 లక్షలు) , బిఎమ్‌డబ్ల్యూ కార్లు ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!