
ఒకప్పుడు సీరియల్స్ ద్వారా జనాలకు దగ్గరయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. నటనపై ఆసక్తితో ఆత్మ విశ్వాసంతో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికలలో ఆమె ఒకరు. తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ వసూలు చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మృణాల్ ఠాకూర్.
ఇవి కూడా చదవండి : గ్లామర్లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..
కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్ 2014 నుండి ఇండస్ట్రీలో చురుగ్గా ఉంటున్నారు. మొదట్లో మరాఠీ భాషా చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. లవ్ సోనియా, జెర్సీ, సూపర్ 30 వంటి చిత్రాలతో నార్త్ లో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత 2022లో విడుదలైన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఆమె జీవితంలో పెద్ద మలుపు తిరిగింది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో వరుస అవకాశాలు అందుకుంటున్న ఆమె.. చేతిలో 5కు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 2 తెలుగు సినిమాలు కావడం విశేషం. నివేదికల ప్రకారం మృణాల్ ఆస్తుల విలువ రూ.40 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అలాగే ఆమె వద్ద హోండా అకార్డ్, టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్-బెంజ్ S450 కార్లు ఉన్నాయి. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫాలోవర్ల సంఖ్య 15 మిలియన్లు దాటింది.
ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..