
సినిమా ఇండస్ట్రీలో ఆవిడ ఒక ధ్రువతార.. స్టార్ హీరోయిన్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఆమె.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమె కోసం, ఆమె డేట్స్ కోసం లైన్ లో నిలబడేవారు. ఎంతో మంది అభిమాన హీరోయిన్ ఆమె.. ప్రేక్షులకే కాదు సినిమా హీరోలలోనూ చాలా మందికి ఆమె అభిమాన హీరోయిన్. ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఊహించని విషయం ఏంటంటే.. చేతికి రాఖీ కట్టి, అన్నయ్య అని పిలిచింది. కట్ చేస్తే అతనినే పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలను కూడా కన్నది. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది.? అసలు ఆ కథ ఏంటి.? అనేది ఒక్కసారి చూద్దాం.!
శ్రీదేవి తెలియని తెలుగు ప్రేక్షకులను ఉండరు. ఈ అందాల తార పుట్టినరోజు నేడు. ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అతను ఫిబ్రవరి 24, 2018 న మరణించారు. శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోటల్‌లోని బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందారు. శ్రీదేవి మరణంపై ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెబుతున్నారు.
శ్రీదేవి బాలీవుడ్ నిర్మాతను బోనీ కపూర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే బోనీ మోనా శౌరీను మొదటి వివాహం చేసుకున్నాడు. ఆమెతో విడిపోయిన తర్వాత శ్రీదేవి వివాహం చేసుకున్నాడు. అయితే మోనా శౌరీతో విడిపోక ముందే బోనీ శ్రీదేవిని ప్రేమించాడట.. అయితే బోనీ శ్రీదేవి ప్రేమ వ్యవహారం పసిగట్టిన బోనీ కపూర్ తల్లి.. శ్రీదేవిని పిలిపించి.. బోనీ కపూర్ కు రాఖీ కట్టించిందట. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆతర్వాత కొన్నేళ్ళకు శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు బోనీ. అయితే పెళ్ళికి ముందే శ్రీదేవి తల్లయింది. ఆతర్వాత వీరి వివాహం జరిగింది. ఇక బోనీకి , శ్రీదేవికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి