Tollywood: రూ.5 వేలతో ఇండియాకు వచ్చి.. ఇప్పుడు 5 నిమిషాలకు 2 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్..

సినీరంగుల ప్రపంచం ఎవరినైనా ఆకర్షిస్తుంది. ఈ పరిశ్రమలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో వస్తుంటారు. కానీ అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొని ఇండస్ట్రీలో రాణించిన వారు చాలా తక్కువే. అందులో ఈ అమ్మాయి ఒకరు. నటిగా కొనసాగాలని రూ.5వేలతో కెనడా నుంచి ఇండియాకు వచ్చింది. ఇప్పుడు 5 నిమిషాలకు రూ.2 కోట్లు వసూలు చేస్తుంది.

Tollywood: రూ.5 వేలతో ఇండియాకు వచ్చి.. ఇప్పుడు 5 నిమిషాలకు 2 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్..
Nora Fatehi

Updated on: Apr 30, 2025 | 2:38 PM

సినీరంగంలో చాలా మందికి సులభంగా విజయం వరిస్తుంది. కొందరు స్టార్ డమ్ సంపాదించుకుంటారు. మరికొందరు తక్కువ సమయంలోనే కనుమరుగవుతుంటారు. కానీ ఈ నటి మాత్రం ఇప్పుడు ఉన్న స్థితికి చేరుకోవడానికి తీవ్రమైన పోరాటాలను ఎదుర్కొంది. సవాళ్లు, మోసాలు, అడ్డంకులు, అవమానాలు ఎదుర్కొని ధైర్యంగా నిలబడింది. ఇప్పుడు స్పెషల్ పాటలతోనే పాపులర్ అయ్యింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నోరా ఫతేహి. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. కెనడాలోని టొరంటోలో పుట్టి పెరిగిన నోరా ఫతేహి, రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్ అనే హిందీ చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. టెంపర్, బాహుబలి: ది బిగినింగ్, కిక్ 2 వంటి చిత్రాలలో ఆమె ప్రత్యేక పాత్ర పాటలతో పాపులర్ అయ్యింది.

ముఖ్యంగా ఆమె నటించిన దిల్ బర్ సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాట ఎంతగా హిట్ అయ్యిందంటే అది ఆమెను అంతర్జాతీయ స్టార్‌గా మార్చింది. నోరా ఫతేహి విజయం అంత సులభం కాదు. ఎన్నో అవమానాలు ఎదుర్కోంది. ఒక ఇంటర్వ్యూలో నోరా ఫతేహి మాట్లాడుతూ.. “నేను కేవలం రూ. 5,000 తో భారతదేశానికి వచ్చాను. మూడు బెడ్ రూమ్ గదులున్న అపార్ట్‌మెంట్‌లో తొమ్మిది మంది మానసిక రోగులతో నేను నివసించాను. అప్పట్లో ఎన్నో కష్టాలు చూశాను. ఒకప్పుడు ఒక ఏజెన్సీ నన్ను మోసం చేసింది. అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి.. నా పారితోషికం నుంచి అద్దె, కమిషన్ కట్ చేశారు. పీల్చే గాలిని సైతం కట్ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తారు. అప్పట్లో ఆకలికి గుడ్డు, బ్రెడ్, పాలు తాగి బతికను. ఏజెన్సీలలో చాలా మోసాలు ఉంటాయి. వీటికి చట్టాలు, నిబంధనలు లేవు ” అంటూ చెప్పుకొచ్చింది.

నోరా ఫతేహి చివరిసారిగా అభిషేక్ బచ్చన్ చిత్రం బి హ్యాపీలో కనిపించింది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.52 కోట్లు వరకు ఉంటుందని టాక్. అలాగే ఆమె ఒక సాంగ్ చేయడానికి దాదాపు రూ.2 నుంచి రూ.3 వేలు వసూలు చేస్తుంది. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లకు రూ.5 లక్షలు వసూలు చేస్తుందని సమాచారం.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..