
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఆమెనే ఫస్ట్ చాయిస్ గా మారుతోంది. అదే సమయంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తోందీ అందాల తార. ఇటీవలే థామా వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించిన రష్మిక త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో మన ముందుకు రానుంది. చిలసౌ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ రష్మిక సినిమాపై అంచనాలను పెంచేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటోంది. రష్మికతో పాటు రాహుల్ రవీంద్రన్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.
కాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రష్మిక మందన్నా ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ విషయాన్న డైరెక్టర్ రాహుల్ రవీంద్రనే స్వయంగా వెల్లడించాడు. ‘నేను ఏదైనా ఒక కథ సిద్ధం చేసిన కచ్చితంగా దానిని నా స్నేహితులు వెన్నెల కిషోర్, సమంత, అడివి శేష్ , సుజీత్ వంటి వారికి చూపిస్తుంటాను. ఇది నా అలవాటు. అలా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ ను కూడా సిద్ధం చేసి సమంతకు ఇచ్చాను. ఆమె కథ మొత్తం చదివి ఈ సినిమా చేయడానికి తాను కరెక్ట్ కాదు అని తెలిపింది. అంతేకాదు ఈ సినిమా చేయడానికి కరెక్ట్ పర్సన్ రష్మిక అని సలహా కూడా ఇచ్చింది. దీంతో రష్మికకు ది గర్ల్ ఫ్రెండ్ స్టోరీ పంపించాను. ఆమె రెండు రోజులపాటు ఈ స్టోరీ చదివి, ఈ సినిమాకు నేను బాగా కనెక్ట్ అయ్యాను, వెంటనే సినిమా ప్రారంభిద్దామని రష్మిక చెప్పింది’ అని రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు. అలా సమంత చేయాల్సిన సినిమా చివరకు రష్మిక దగ్గరకు వచ్చిందన్నమాట.
The chase before the chaos ❤🔥#TheGirlFriend Third Single #Layile out now!
▶️ https://t.co/zZEgaKZu0BA @HeshamAWMusic musical
Sung by @KapilKapilan_
Lyrics by @RakenduMouliV #TheGirlfriend in cinemas on November 7th#TheGirlfriendOnNov7th@iamRashmika @Dheekshiths… pic.twitter.com/9GPj2buNPW— Geetha Arts (@GeethaArts) October 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.