
చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. కానీ అదే సమయంలో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తో ప్రేమ..బ్రేకప్ అతడి కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో సినిమాలు వదిలేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు కోట్ల విలువైన సామ్రాజ్యానికి అతడు అధిపతి అయ్యారు. అతడు మరెవరో కాదండి.. వివేక్ ఒబెరాయ్. రాజకీయ నాయకుడు సురేష్ ఒబెరాయ్ కుమారుడే ఇతడు. ఇటీవల అతను ‘దుబాయ్ ప్రాపర్టీ ఇన్‌సైడర్’ అనే పాడ్‌కాస్ట్‌లో తన తండ్రి తనకు జీవితం, వ్యాపారం గురించి నేర్పించాడని, కానీ ఆర్థికంగా ఎప్పుడూ సహాయం చేయలేదని అన్నారు. తనకు కేవలం 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, తన తండ్రి తనకు ఒక ఉత్పత్తిని ఇచ్చి, దానిని అమ్మడానికి ఒక ప్రణాళిక వేయమని అడిగేవాడని చెప్పాడు.
చిన్న వయసు నుంచే తన తండ్రి తనకు వ్యాపారంలో మెలకువలు నేర్పించాడని.. అందుకే చిన్నప్పటి నుంచే ఇంటింటికీ వెళ్లి చిన్న వస్తువులను అమ్మేవాడినని గుర్తుచేసుకున్నాడు. 19 ఏళ్ల వయసులో లక్షలాది నిధులు సేకరించి తన మొదటి కంపెనీని ప్రారంభించానని.. ఆ కంపెనీ మంచి లాభాలను తీసుకువచ్చిందని.. దీంతో 23 ఏళ్ల వయసులోనే దానిని మరింత లాభాలకు అమ్మేశానని అన్నారు. వివేక్ ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్లో 9 కంపెనీలను జాబితాను సిద్ధం చేశాడు. మరో 4 కంపెనీలను జత చేయాలని చూస్తున్నారట. ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం వివేక్ ఆస్తులు మొత్తం 1200 కోట్లు. అతడు BNW రియల్ ఎస్టేట్, సాలిటారియో, ఇంప్రెసారియో గ్లోబల్, రట్లాండ్ స్క్వేర్, స్పిరిట్స్, రెడీ అసిస్ట్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు.
ఇక వివేక్ సినిమాల విషయానికి వస్తే..
2002లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మించిన కంపెనీ చిత్రంతో సినీరంగంలోకి అరంగేట్రం చేశారు. ఆ తర్వాత సాథియా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో నటించారు. కానీ కొన్నాళ్లకే సినిమాలకు దూరమైన వివేక్.. అటు వ్యాపారంలో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పర్చుకున్నారు. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..