Tollywood: మన దేశంలో అత్యధిక బంగారం ఉన్న స్టార్ హీరో ఎవరో తెలుసా? వామ్మో! ఏకంగా అన్ని కోట్ల ఆభరణాలున్నాయా?
గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ఆకాశనంటుతున్నాయి. దీంతో సామాన్యులకు పసిడిని కొనడం బాగా కష్టంగా మారింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా భారత ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ప్రకటనతో బంగారం కాస్తా ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది.

బంగారమంటే ఎవరికి చేదు చెప్పండి.. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం ఉండాల్సిందే. ఇక పెళ్ల వేడుకల సమయంలో వధూ వరుల కోసం భారీగా బంగారం కొనుగోలు చేయాల్సిందే. అయితే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు మరీ ఆకాశనంటుతున్నాయి. రోజు రోజుకు పసిడి రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడికి బంగారం కొనడం భారంగా మారింది. ఈ కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలక విజ్ఞప్తి చేశారు. భారత ప్రజల సుమారు ఏడాది పాటు బంగారం కొనవద్దని రిక్వెస్ట్ చేశారు. ప్రధాని ప్రకటనతో బంగారం ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. బంగారం గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి? అసలు బంగారం ధరను ఎలా నిర్ణయిస్తారు? ఇండియాలో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంది? మరీ ముఖ్యంగా మన సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో దగ్గర ఎక్కువ బంగారం ఉంది? అంటూ నెటిజన్లు గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. మన దేశంలో అత్యధిక బంగారం ఉన్న నటుడు మరెవరో కాదట బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.
ఎనిమిది పదుల వయసు దాటినా ఇప్పటికీ సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటున్నారు అమితాబ్ బచ్చన్. అంతేకాదు ఇప్పటికీ ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఆయన ఒకరిగా ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులున్న హీరోల్లో బిగ్ బీ కూడా ఒకరు. ఈ క్రమంలోనే అమితాబ్ తన సంపాదనను ఎక్కువగా బంగారం పైనే ఇన్వెస్ట్ చేశారట. 2024 సంవత్సరంలో.. జయా బచ్చన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులతో పాటు భర్త అమితాబ్ బచ్చన్ ఆస్తుల గురించి సమాచారం ఇచ్చారు. అందులో ఆమెతో పాటు బిగ్ బీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాల గురించి పూర్తి సమాచారం ఇచ్చారు. ఈ అఫిడవిట్ ప్రకారం, జయా బచ్చన్ దగ్గర రూ. 40.97 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉండగా, అమితాబ్ బచ్చన్ దగ్గర రూ. 54.77 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాట. మొత్తంగా వీరిద్దరి దగ్గర సుమారు రూ. 95 కోట్లకు పైగా విలువైన ఆభరణాలు ఉన్నాయి. వీరితో పాటు హేమ మాలినీ, జయప్రద, కంగనా రనౌత్ తదితర బాలీవుడ్ సెలబ్రిటీల దగ్గర కూడా భారీగానే బంగారం ఉందట.
సచిన్ టెండూల్కర్ తో అమితాబ్ బచ్చన్..
View this post on Instagram
కాగా అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కల్కి 2 సినిమాలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. అమితాబ్ అశ్వథ్థామ పాత్రలో అద్భుతంగా నటించారు. కల్కి పార్ట్ 1లో బిగ్ బీ అశ్వథ్థామ పాత్రలో తన నటనతో అదరగొట్టారు. రెండో పార్ట్ లో ఆయన పాత్ర మరింత కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందట.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




