Tollywood: సౌత్ ఇండస్ట్రీలోని ఈ స్టార్ హీరోస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా ?.. కమల్ హాసన్ నుంచి వెంకటేష్ వరకు..
మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సైతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సంక్రాంతి స్టార్ హీరోస్ మరోసారి హిట్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు యంగ్ హీరోస్ హిట్ చిత్రాలతో దూసుకుపోతుండగా.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్నారు దిగ్గజ తారలు. అంతేకాదు.. రెమ్యునరేషన్ విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్ సత్తా చాటుతున్నారు. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్.. జైలర్ సినిమాతో రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఈ రెండు సినిమాలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేశాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సైతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సంక్రాంతి స్టార్ హీరోస్ మరోసారి హిట్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు యంగ్ హీరోస్ హిట్ చిత్రాలతో దూసుకుపోతుండగా.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్నారు దిగ్గజ తారలు. అంతేకాదు.. రెమ్యునరేషన్ విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న స్టార్ హీరోస్.. అటు రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారట. అంతేకాకుండా అటు సినిమా లాభాల్లోనూ భాగమవుతున్నారు. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో ఫుల్ ఫాంలో ఉన్న హీరోలు ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసుకుందామా.
సూపర్ స్టార్ రజినీకాంత్.. దాదాపు ఐదు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీలో నటుడిగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. తన కెరీర్ లో 169వ సినిమాగా వచ్చిన జైలర్ సినిమాకు రూ.110 కోట్లు తీసుకున్నాడట. ప్రస్తుతం తలైవర్ 170 చిత్రంలో నటిస్తున్నారు.
కమల్ హాసన్ ఛాలెంజింగ్ రోల్ చేయడంలో ముందుంటారు. 2022లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం “విక్రమ్”. ప్రస్తుతం ఇండియన్ 2, కల్కి 2898AD చిత్రాల్లో నటిస్తున్నారు. నివేదికల ప్రకారం, కమల్ హాసన్ “ఇండియన్ 2”లో సేనాపతి పాత్రను పోషించినందుకు తన ఫీజును రూ. 50 కోట్ల (విక్రమ్) నుండి రూ. 150 కోట్లకు పెంచారు.
చిరంజీవి నాలుగు దశాబ్దాలకు పైగా సినీరంగంలో కొనసాగుతున్నారు. నివేదికల ప్రకారం.. తన తాజా చిత్రం “వాల్తేర్ వీరయ్య”లో ప్రధాన పాత్ర పోషించినందుకు రూ. 50 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు.
3010 కోట్ల రూపాయలతో తెలుగు పరిశ్రమలో అత్యంత ధనవంతులైన నటుల్లో నాగార్జున ఒకరు. ఒక్కో సినిమాకు దాదాపు రూ.9 కోట్ల నుంచి రూ.20 కోట్లు తీసుకుంటాడు. అలాగే బిగ్ బాస్ తెలుగు వెర్షన్ హోస్ట్ చేసినందుకు భారీగా పారితోషికం తీసుకుంటున్నారు.
‘వీరసింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ చిత్రాల విజయం తర్వాత ఆయన తన ఫీజును పెంచినట్లు సమాచారం. నివేదికల ప్రకారం తన నెక్ట్స్ సినిమా కోసం రూ. 28 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
దగ్గుబాటి వెంకటేష్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. నెట్‌ఫ్లిక్స్ షో రానా నాయుడుతో ఓటీటీలోకి అరంగేట్రం చేశాడు. నివేదికల ప్రకారం ఈ సిరీస్ కోసం రూ. 10 కోట్లు తీసుకున్నారు. బాలీవుడ్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో నటించినందుకు రూ. 6 కోట్లు తీసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.