
అన్నీ అడ్డంకులు అధిగమించి బాలయ్య అఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (డిసెంబర్ 12) ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. ముఖ్యంగా బాలయ్య రుద్ర తాండవంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఆయన యాక్షన్ సీక్వెన్సులు, ఫైట్స్, డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బోయపాటి శీను గత సినిమాల్లాగానే అఖండ 2లో కూడా భారీ క్యాస్టింగ్ ఉంది. ఈ మూవీలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే బజరంగీ భాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా, జగపతి బాబు, ఆది పినిశెట్టి, కబీర్ దుల్హన్ సింగ్, సాస్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ, సాయి కుమార్, హర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా అఖండ 2 సినిమాలో చాలా మంది విలన్లు నటించారు. అందులో ఆది పినిశెట్టి కూడా ఉన్నాడు. తాంత్రికుడి పాత్రలో అతని ఆహార్యం, లుక్ అడియెన్స్ ను భయపెట్టాయి.
కాగా నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఈ తాంత్రికుడి క్యారెక్టర్ కు ఆది పినిశెట్టి ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ క్యారెక్టర్ కోసం చాలా మంది స్టార్స్ ను సంప్రదించారట డైరెక్టర్ బోయపాటి శీను. ముందుగా మంచు మనోజ్‌కు ఆఫర్ ఇచ్చారట. బోయపాటి స్వయంగా తనకు కథ కూడా వినిపించాడట. అయితే ఇప్పటికే తన చేతిలో పలు సినిమాలు ఉండడంతో మనోజ్ ఈ సినిమా చేయలేకపోయాడట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం మరికొందరు హీరోలను కలిశారట బోయపాటి. కానీ ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో చివరకు ఆది పినిశెట్టి దగ్గరకు ఈ మూవీ వెళ్లిందట. అతని ఫ్రెండ్స్ కూడా ఈ క్యారెక్టర్ చేయమని సజెస్ట్ చేయమనడంతో ఆది వెంటనే కథ విన్నాడట. ఆ వెంటనే నటించేందుకు కూడా ఓకే చెప్పాడట. అలా మొత్తానికి అఖండ 2 సినిమాలో ఆది పినిశెట్టి ఫైనల్ అయ్యాడట.
Theatres are turning into temples 🙏❤️
Akhanda Thaandavam taking over everywhere 🔥#Akhanda2#NandamuriBalakrishna pic.twitter.com/fuxv8o6opC
— Praneeth Chowdary (@praneethballa) December 12, 2025
గతంలో బోయపాటి శీను– అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన సరైనోడులోనూ పవర్ ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టాడు ఆది. ఇందులో అతని పాత్రకు మంచి పేరొచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే డైరెక్టర్ మూవీలో తాంత్రికుడిగా ఆడియెన్స్ ను భయపెట్టాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.