Shaakuntalam: శాకుంతలం సినిమాలో సమంత ధరించిన నగలు, చీర ధర.. బరువు తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే
ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’.
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న లేటెస్ట్ మూవీ శాకుంతలం. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా తెరకెక్కించే గుణ శేఖర్ మరోసారి ‘శాకుంతలం’ వంటి విజువల్ వండర్‌తో పాన్ ఇండియా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయటానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అందులో భాగంగా విడుదలైన మూవీ ట్రైలర్, ‘మల్లికా మల్లికా..’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి.
మలయాళీ యాక్టర్ దేవ్ మోహన్, డా.మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా శాకుంతలం సినిమా గురించి సమంత గురించి ఆసక్తికర విషయం ఒకటి ఇప్పుడ్డు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
పౌరాణిక చిత్రం ఈ సినిమాలో సమంత ధరించిన చీర, నగలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సమంత క్యారెక్టర్ కోసం హైదరాబాద్‌కి చెందిన వసుంధర డైమండ్ రూఫ్ వారు ప్రత్యేకంగా నగలు డిజైన్ చేశారట. ఆమె ధరించిన నగల ధర ఏకంగా 93 కోట్ల రూపాయిలు అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం సామ్ ఏకంగా 30 కిలోల బరువుండే శారీ కట్టుకోగా.. ఆ చీరతో ఏడు రోజుల పాటు షూట్ చేశారట. ఇప్పుడు ఇదే ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.