
నందమూరి తారకరామరావు వారసులుగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి తమకంటూ ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకున్నారు కళ్యాణ్ రామ్. డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవల బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీతో కళ్యాణ్ రామ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు హిట్స్ పై కన్నేశారు. కంటెంట్ ప్రాధాన్యత పై దృష్టి పెట్టి స్టోరీ సెలక్షన్స్ విషయంలో అచి తూచి అడుగులు వేస్తున్నారు. కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభినయంలో నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న గ్రాండ్ లెవల్లో సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘అమిగోస్’ మూవీ టీజర్, సాంగ్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి.
అయితే ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ నటించిన చిత్రాల కంటే ఈ సినిమా టైటిల్ మాత్రం కాస్త ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అమిగోస్ అంటూ ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టైటిల్ అర్థం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు ప్యాన్స్. ఇటీవల ఓ షోలో పాల్గొన్న కళ్యాణ్ రామ్.. ఈ సినిమా టైటిల్ అర్థం ఏంటో చెప్పేసారు. అమిగోస్ అనేది స్పానిష్ పదం. ఓ స్నేహితుడిని సూచించడానికి లేదా.. రిఫర్ చేయడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారట. మొత్తానికి టైటిల్ పేరుతో అందరిలో క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ కన్నడ బ్యూటీ. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.