నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.. అందుకే ఉప్పెన వదులుకున్నా.. షాకింగ్ విషయం చెప్పిన క్రేజీ బ్యూటీ

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఏకంగా 100కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. డెబ్యూ హీరో సినిమా 100 కోట్లు వసూల్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఇక ఈ సినిమాతో కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ మంగుళూరు బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.. అందుకే ఉప్పెన వదులుకున్నా.. షాకింగ్ విషయం చెప్పిన క్రేజీ బ్యూటీ
Uppena
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 16, 2024 | 5:42 PM

ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయం అయ్యాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఏకంగా 100కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. డెబ్యూ హీరో సినిమా 100 కోట్లు వసూల్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఇక ఈ సినిమాతో కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ మంగుళూరు బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్యూట్ స్మైల్ తో పాటు తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సినిమాలో నెగిటివ్ రోల్‌లో నటించి మెప్పించారు.

ఇది కూడా చదవండి : Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఇదిలా ఉంటే ఉప్పెన సినిమాను ఓ క్రేజీ హీరోయిన్ మిస్ చేసుకుందని మీకు తెలుసా.. అవుతూ ఉప్పెన సినిమా ఆఫర్ ముందుగా ఓ హీరోయిన్ దగ్గరకు వెళ్ళింది కానీ ఆతర్వాత కృతి శెట్టి దగ్గరకు వచ్చింది ఆ సినిమా.. ఉప్పెన సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్. ఉప్పెన సినిమా ఆఫర్ వచ్చిందని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఇది కూడా చదవండి :దుమ్మురేపిన దేవుళ్ళు పాప..! అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..!

శివాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఉప్పెన సినిమా ఆఫర్ వచ్చింది. అయితే ఈ సినిమా కథ ముందుగా రాసుకుందానికి ఇప్పుడు తీసిందానికి చాలా తేడా ఉంది. ముందుగా కథను బోల్డ్ గా రాశారు. నాకు కథ చెప్పినప్పుడు అదే బోల్డ్ స్టోరీ చెప్పారు. అందులో లిప్ లాక్స్ , అలాగే మరికొన్ని కూడా ఉన్నాయి. నేను అప్పుడు అంతగా కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదు. నాకు భయం మేసింది. ఇప్పుడు కూడా ఇంటిమెంట్ సీన్ చేయాలంటే నన్ను కన్విన్స్ చేయాలి.. నేను ఎంతవరకు ఆ సీన్స్ చేయగలనో చెప్పలేను అని చెప్పుకొచ్చింది శివాని. దానివల్లే తాను ఉప్పెన సినిమా ఆఫర్ వదులుకున్నాను అని తెలిపింది.

ఇది కూడా చదవండి: సినిమాల్లో బోల్డ్‌గా కనిపిస్తే.. పెద్ద హీరోలతో ఆ పని చేయాలా..? అసలు విషయం బయటపెట్టిన నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.