Arundhati : అరుంధతి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఇప్పుడు తెగ ఫీలైపోతుంది ఆమె
ఈ సినిమాలో అనుష్క నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే పశుపతిగా నటించిన సోనూసూద్ అందరిని భయపెట్టారు. 2009లో వచ్చిన ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకోవడమే కాకుండా..

అనుష్క కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా అరుంధతి. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అనుష్క నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే పశుపతిగా నటించిన సోనూసూద్ అందరిని భయపెట్టారు. 2009లో వచ్చిన ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఒక కొత్త ట్రెండ్ ను కూడా మొదలు పెట్టింది. ఈ సినిమా తర్వాత అదే తరహా సినిమాలు చాలా వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క కంటే ముందు మరో ముద్దుగుమ్మను అనుకున్నారట. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? అరుంధతి ఛాన్స్ మిస్ అయ్యినందుకు ఇప్పుడు ఆమె తెగ ఫీల్ అవుతున్నారు. ఇంతకు ఆమె ఎవరంటే..
అరుంధతి సినిమాలో ముందుగా హీరోయిన్ గా కోడిరామకృష్ణ హీరోయిన్ ప్రేమ ను అనుకున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ మాట్లాడుతూ.. ఆ విషయాలను పంచుకున్నారు. కోడిరామ కృష్ణ దర్శకత్వంలో ప్రేమ దేవి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.
ప్రేమ మాట్లాడుతూ.. కోడి రామకృష్ణ గారికి నాకు మధ్య మంది అనుబంధం ఉంది. దేవి సమయంలో ఆయన నాకు తెలుగు నేర్పించారు అని తెలిపారు ప్రేమ. అరుంధతి పాత్ర కోసం ముందుగా నన్ను సంప్రదించారట. కానీ అప్పటికి తను కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో డేట్స్ అడ్జస్ట్ కాక ఈ సినిమా అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు ప్రేమ.

Prema
