12మంది హీరోలు నో చెప్పిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సూర్య.. ఆ సినిమా ఎదో తెలుసా..

ఓ హీరో రిజక్ట్ చేసిన సినిమాతో మరో హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఒక కథ పట్టుకొని దర్శకులు చాలా మంది హీరోల చుట్టూ తిరుగుతారు. ఫైనల్ గా ఓ హీరో ఓకే చేస్తాడు. అదృష్టం బాగుంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే 12 మంది హీరోలు నో చెప్పిన కథతో ఓ హీరో సినిమా చేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ హర్ ఎవరు.. ఆ సినిమా ఎదో తెలుసా.? 

12మంది హీరోలు నో చెప్పిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సూర్య.. ఆ సినిమా ఎదో తెలుసా..
Surya
Follow us

|

Updated on: Jun 22, 2024 | 4:06 PM

చాలా మంది హీరోలు కథల విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓ దర్శకుడు వచ్చి కథ చెప్తే అన్ని యాంగిల్స్ లో ఆలోచించి ఆ సినిమా చేయడానికి రెడీ అవుతారు. లేదంటే సున్నితంగా తిరస్కరిస్తారు. అయితే అలా ఓ హీరో రిజక్ట్ చేసిన సినిమాతో మరో హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఒక కథ పట్టుకొని దర్శకులు చాలా మంది హీరోల చుట్టూ తిరుగుతారు. ఫైనల్ గా ఓ హీరో ఓకే చేస్తాడు. అదృష్టం బాగుంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే 12 మంది హీరోలు నో చెప్పిన కథతో ఓ హీరో సినిమా చేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ హర్ ఎవరు.. ఆ సినిమా ఎదో తెలుసా.?

స్టార్ డైరెక్టర్ మురగదాస్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన చేసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో గజినీ సినిమా ఒకటి. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. తమిళ్ భాషలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది ఈ సినిమా. అలాగే హిందీలోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా కథ ముందు పలువురు హీరోలకు వినిపించారట మురగదాస్.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి కళాఖండంరా బాబు..! ఇండియాలోనే అతి పెద్ద డిజాస్టర్‌ మూవీ ఇదే

గజినీ సినిమాను 12మంది హీరోలు రిజక్ట్ చేశారని గతంలో మురగదాస్ స్వయంగా చెప్పారు. క‌మ‌ల్‌తో పాటు ర‌జినీ కాంత్, విజ‌య్ కాంత్‌, దళపతి విజ‌య్ లతో పాటు మన సూపర్ స్టార్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కు కూడా ఇదే కథను వినిపించారట మురగదాస్. అయితే ఒంటినిండా పచ్చబొట్లు పొడుచుకోవాలని అనేసరికి మహేష్ బాబు ఆ సినిమాను రిజక్ట్ చేశారట.. అలాగే పవన్ కళ్యాణ్ సైతం ఇదే కారణంతో గజినీ సినిమాను రిజక్ట్ చేశారట. అలాగా 12 మందికి ఈ సినిమా కథను వినిపించగా అందరూ రిజెక్ట్ చేశారట. అలాగే 13వ హీరోగా సూర్య చేశాడు. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో గజినీ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. అలాగే ఇదే సినిమాను హిందీలో సమీక్ ఖాన్ తో చేసి హిట్ అందుకున్నారు మురగదాస్.

Gajini

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.