Suma Kanakala: అయ్య బాబోబ్.. సమక్క ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిందా..! మళ్లీ టాప్ డైరెక్టర్
బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన సుమ కనకాల.. నటిగా కూడా పలు సీరియల్స్, సినిమాల్లో నటించి, ఆ తరువాత పూర్తిగా యాంకరింగ్‌పై దృష్టి పెట్టి టెలివిజన్‌లో టాప్ స్టాయికి చేరింది. అయితే ఆమె హీరోయిన్‌గా ఓ పెద్ద డైరెక్టర్ సినిమాలో చేసిందని మీకు తెలుసా..?

తెలుగు బుల్లితెరపై సుస్థిర స్థానం సంపాదించిన పేరు సుమ కనకాల. తన మార్క్ యాంకరింగ్ శైలి, చలాకీతనం, పంచ్‌లతో ఎన్నో టీవీ కార్యక్రమాలను విజయవంతంగా నడిపిస్తుంది ఆమె. మాతృభాష కాకపోయినా.. తెలుగు అనర్గళంగా మాట్లాడే స్కిల్, స్వచ్చమైన ఉచ్చారణతో ప్రేక్షకులను కట్టిపడేసే తత్వం ఆమె సొంతం. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్, గేమ్ షోలు, టాక్ షోలు.. ఏ వేదికైనా తనదైన స్టైల్లో అలరించడం ఆమె ప్రత్యేకత. ఈ కారణంగానే స్టార్ హీరోలు సైతం ఆమె అభిమానులుగా మారిపోయారు.
యాంకరింగ్ ప్రారంభం కావడానికి ముందు సుమ పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. వేయిపడగలు సీరియల్‌లో ప్రధాన పాత్ర ద్వారా స్మాల్ స్క్రీన్‌పై తొలిసారిగా పరిచయమయ్యారు. తర్వాత మేఘమాల సీరియల్ చేస్తుండగానే నటుడు రాజీవ్ కనకాలతో పరిచయం, ప్రేమ మొదలైంది. సినిమాల్లో కూడా ఆమె ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోయిన్‌గా నటించడం ద్వారా సుమ సినిమా కెరీర్ స్టార్ట్స్ చేశారు. అనంతరం రెండు మలయాళ చిత్రాల్లోనూ ప్రధాన పాత్రలు చేశారు. కానీ యాంకరింగ్‌లో అడుగుపెట్టిన తర్వాత సినిమాలపై ఫోకస్ తగ్గించి.. పూర్తిగా టెలివిజన్ రంగంలోకి వెళ్లారు
2006లో అవాక్కయ్యారా… కార్యక్రమంతో యాంకరింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది సుమ. అప్పటి నుంచి పలు హిట్ ప్రోగ్రామ్‌లు నడిపి టీవీ రంగంలో టాప్ హోస్ట్‌గా నిలిచారు. మధ్యలో కొన్ని సినిమాల్లో చిన్నపాత్రలు చేసినప్పటికీ.. టెలివిజన్‌లో ఆ మాత్రం క్వీన్‌గా ఏలుతున్నారు. మోన్నామధ్య జయమ్మ పంచాయితీలాంటి సినిమాలో లీడ్ రోల్ చేసినా అంతగా కలిసిరాలేదు.
ప్రస్తుతం కూడా సుమ యాంకరింగ్‌లో తిరుగులేని స్థానంలో ఉన్నారు. ఆమె కుమారుడు రోషన్ హీరోగా సినిమా రంగంలో అడుగుపెట్టాడు. బబుల్‌గమ్ తర్వాత ఇప్పుడు మోగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
View this post on Instagram




