Shreya Goshal: ఇండస్ట్రీలోనే రిచ్ సింగర్.. శ్రేయా ఘోషల్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా ?..
పన్నెండేళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించి ఇప్పటివరకు దాదాపు 25000లకు పైగా పాటలు పాడింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాళీ ఇలా అన్ని భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించారు. ఇప్పటికీ ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్లో ఆమె ఒకరు. అంతేకాదు.. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్స్ లో ఆమె కూడా ఒకరు. ఆమె గాత్రానికే కాదు.. సున్నిత ప్రవర్తనకు.. అందమైన చిరునవ్వుకు.. అందమైన రూపానికి అభిమానులు చాలా మంది ఉన్నారు.
సినీ సంగీత ప్రపంచంలోని అద్భుతమైన గాయనీమణులలో శ్రేయా ఘోషల్ ఒకరు. పన్నెండేళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించి ఇప్పటివరకు దాదాపు 25000లకు పైగా పాటలు పాడింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాళీ ఇలా అన్ని భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించారు. ఇప్పటికీ ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్లో ఆమె ఒకరు. అంతేకాదు.. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్స్ లో ఆమె కూడా ఒకరు. ఆమె గాత్రానికే కాదు.. సున్నిత ప్రవర్తనకు.. అందమైన చిరునవ్వుకు.. అందమైన రూపానికి అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆమె వాయిస్ శ్రోతల మనసులను మెస్మరైజ్ చేస్తుంది. బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఆమె రూపం ముందు దిగదుడుపే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది శ్రేయా. ఇప్పుడు ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
నివేదికల ప్రకారం ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయని. అలాగే సినీ పరిశ్రమలో రిచ్ సింగర్. ఆమె ఆస్తులు రూ. 180 నుంచి రూ. 185 కోట్లు ఉంటుంది. శ్రోతలను మంత్రముగ్దులను చేసే స్వరం ఆమె సొంతం. ఆమె పాటలు చెవుల్లో తేనె పోసినట్లుగా ఉంటాయి. సంతోషం, దుఃఖం, బాధ, ప్రేమ, విరహం ఇలా అన్ని భావాలను జనాల హృదయాలను తాకుతుంది. కానీ శ్రేయా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కపాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం శ్రేయా పారితోషికం విషయం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.
తాజా సమాచారం ప్రకారం సినిమాలోని ఒక పాట కోసం శ్రేయా దాదాపు రూ. 25 లక్షలు తీసుకుంటుందట. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ లేదు. ఇటీవల అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో శ్రేయా ఘోషల్ సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే ఫేమస్ సింగర్ అర్జిత్ సింగ్ తో కలిసి కొన్ని పాటలు ఆలపించింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. చిన్న వయసులోనే సరిగమప రియాల్టీ షో ద్వారా గాయనిగా ప్రయాణం ఆరంభించింది. 16 ఏళ్ల వయసులో ఈ సింగింగ్ షో విజేతగా నిలిచింది. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన దేవదాస్ సినిమాలో మొదటి సాంగ్ పాడింది. ఆ తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. ఇప్పటివరకు హిందీలో 200కి పైగా పాటలు పాడింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.