- Telugu News Photo Gallery Cinema photos Jyothika and Priyamani are busy with content films, regardless of whether they are from the North or the South
Heroines: అందరి చూపులూ జ్యోతిక, ప్రియమణిపైనే.. అంతగా ఏమి చేసారు.?
సీనియర్ హీరోయిన్ల సక్సెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, అందరి చూపులూ జ్యోతిక, ప్రియమణి చుట్టూ తిరగాల్సిందే. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా మీనింగ్ ఫుల్ కంటెంట్‌తో మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నారు వీరిద్దరూ. ఎప్పటికప్పుడు ఫిట్‌గా ఉంటూ, అదుర్స్ అనిపిస్తున్న వీరిద్దరి మీద మనం కూడా ఫోకస్ చేసేద్దామా... .ఫిట్‌నెస్ గోల్స్ కహానీలు యంగ్ బ్యూటీస్ ఇన్‌స్టా పేజీల్లోనే కనిపిస్తాయనుకుంటే పొరపాటే.
Updated on: Mar 14, 2024 | 9:44 AM

సీనియర్ హీరోయిన్ల సక్సెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, అందరి చూపులూ జ్యోతిక, ప్రియమణి చుట్టూ తిరగాల్సిందే. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా మీనింగ్ ఫుల్ కంటెంట్‌తో మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నారు వీరిద్దరూ. ఎప్పటికప్పుడు ఫిట్‌గా ఉంటూ, అదుర్స్ అనిపిస్తున్న వీరిద్దరి మీద మనం కూడా ఫోకస్ చేసేద్దామా...

ఫిట్‌నెస్ గోల్స్ కహానీలు యంగ్ బ్యూటీస్ ఇన్‌స్టా పేజీల్లోనే కనిపిస్తాయనుకుంటే పొరపాటే. జ్యోతిక వర్కవుట్స్ చూసిన వారెవరైనా సరే, వారెవా అనాల్సిందే. అంత ఫిట్‌గా ఉంటున్నారు ఈ లేడీ. ఇటీవల ఈమె వర్క్ అవుట్ చేస్తున్న ఓ వీడియో వైరల్ అయింది.

అంతే కాదు, సినిమాల్లో ఆమె స్టోరీ సెలక్షన్‌కి కూడా ఫిదా అవుతున్నారు జనాలు. రీసెంట్‌గా ఆమె మలయాళంలో మమ్ముట్టితో చేసిన కాదల్ ది కోర్‌కీ, ఈ మధ్య నార్త్ లో రిలీజ్ అయిన సైతాన్‌కి సూపర్బ్ అప్లాజ్ వచ్చింది. ప్రస్తుతం మరికొన్ని సినిమా నటిస్తున్నారు.

ఇటు ప్రియమణి కూడా ఓ రేంజ్‌లో బిజీ అయిపోయారు. ఆమె గట్టి నమ్మకంతో చేసిన భామా కలాపం2 కూడా ప్రేక్షకులతో ఆహా అనిపించుకుంది. ఫస్ట్ పార్టుకి ఏమాత్రం తగ్గకుండా సెకండ్ పార్టు ఉందంటూ విమర్శకుల ప్రశంసలు పొందింది భామా కలాపం సీక్వెల్.

నార్త్ లో ఆర్టికల్ 370కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. భామా కలాపం2 ప్రమోషన్లలోనే ఆర్టికల్ 370 గురించి ఎగ్జయిటింగ్‌గా చెప్పేవారు ప్రియమణి. 2024లో రెండు సినిమాలతో ఆల్రెడీ సక్సెస్‌లో ఉన్నారు ఈ లేడీ. ఆ సక్సెస్‌ని ఆస్వాదించే తీరిక లేనంత బిజీగానూ ఉన్నారు ప్రియమణి.




