హీరో శర్వానంద్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇద్దరూ చుట్టాలే… వీరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..

Sharwanand: మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోల మధ్య ఫ్యామిలీ రిలేషన్ షిప్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు తండ్రి తనయులు, అన్నదమ్ములు హీరోలుగా..

హీరో శర్వానంద్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇద్దరూ చుట్టాలే... వీరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..
Sharwanadh Ram Pothineni

Updated on: May 21, 2021 | 11:00 PM

Sharwanand: మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోల మధ్య ఫ్యామిలీ రిలేషన్ షిప్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు తండ్రి తనయులు, అన్నదమ్ములు హీరోలుగా.. నిర్మాతలుగా.. దర్శకులుగా రాణిస్తున్నారు. అలాగే మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. అలాగే.. బావ బామ్మర్ది వరుస అయ్యే స్టార్ కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు. అందులో మహేష్, సుధీర్ బాబు గురించి మనకు తెలిసిన విషయమే.. వీరే కాకుండా.. మరికొంతమంది కూడా ఉన్నారు. వెంకటేష్.. నాగార్జున, అల్లు అర్జున్, రామ్ చరణ్, కళ్యాణ్ దేవ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నారా రోహిత్, నాగ చైతన్య, సుశాంత్ వీరందరి మధ్య రిలేషన్ ఉంది. అలాగే మరో ఇద్దరూ స్టార్ హీరోలు కూడా వరుసగా బావ బామ్మర్దులే అవుతారు. Ram Pothineni

శర్వానంద్‌, రామ్‌ పోతినేని ఇద్దరు వరుసకు బావబామ్మర్దులు అవుతారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. శర్వానంద్‌ బ్రదర్ కల్యాణ్.. రామ్‌ పోతినేని అక్క మధు స్మితను పెళ్లి చేసుకున్నారు. దీంతో వీరిద్దరూ బావ బామ్మర్దులుగా మారిపోయారు. ఇక ప్రస్తుతం ఈ యంగ్ హీరోలిద్దరూ తమ సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామ్ తమిళ డైరెక్టర్‌ లింగు స్వామి డైరెక్షనోలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి నటించనున్నారు. అలాగే శర్వానంద్‌ అటు ఆర్‌ 100 ఫేమ్ అజయ్‌ భూపతి డైరెక్షన్లో మహా సముద్రం చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆడవాల్లు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా చేస్తున్నారు.

Also Read: Night Dinner: రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా.! అయితే డేంజరే.!! ఈ విషయాలు తెలుసుకోండి..

Anandayya corona medicine : సాఫీగా సాగిపోయే కార్యక్రమాన్ని గందరగోళం చేయకండి : ఏపీ సర్కారుకి సోమిరెడ్డి విజ్ఞప్తి

Black Salt Benefits : నల్ల ఉప్పు గురించి మీకు తెలుసా..? అనేక రోగాలకు నివారణ..! ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..