Rashmika Mandanna: నేషనల్ క్రష్ సంపాదన తెలిస్తే షాకే.. రష్మిక మందన్నా ఇల్లు, ఖరీదైన కార్ల కలెక్షన్ చూశారా ?..

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మార్చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేక్ చేసింది. దీంతో హిందీలోనూ ఈ అమ్మడికి మంచి ఆఫర్స్ వచ్చాయి. ఇటీవల రణబీర్ కపూర్ జోడిగా నటించిన యానిమల్ సైతం భారీ విజయాన్ని అందించింది. ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా నిలిచింది రష్మిక. ఇప్పటివరకు రష్మిక సంపాదించిన ఆస్తులు, ఖరీదైన కార్స్ కలెక్షన్ గురించి తెలుసుకుందామా.

Rashmika Mandanna: నేషనల్ క్రష్ సంపాదన తెలిస్తే షాకే.. రష్మిక మందన్నా ఇల్లు, ఖరీదైన కార్ల కలెక్షన్ చూశారా ?..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2023 | 7:54 PM

1996లో జన్మించింది రష్మిక. ‘కిరిక్ పార్టీ’ అంటూ తొలి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గీతా గోవిందం మూవీతో స్టార్ డమ్ అందుకుంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో టాప్ హీరోయిన్‍గా నిలిచింది. ఇక అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మార్చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేక్ చేసింది. దీంతో హిందీలోనూ ఈ అమ్మడికి మంచి ఆఫర్స్ వచ్చాయి. ఇటీవల రణబీర్ కపూర్ జోడిగా నటించిన యానిమల్ సైతం భారీ విజయాన్ని అందించింది. ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా నిలిచింది రష్మిక. ఇప్పటివరకు రష్మిక సంపాదించిన ఆస్తులు, ఖరీదైన కార్స్ కలెక్షన్ గురించి తెలుసుకుందామా.

నివేదికల ప్రకారం ఇప్పటివరకు రష్మిక దాదాపు రూ.45 కోట్లు ఆస్తి సంపాదించినట్లు సమాచారం. ఆమె నెలవారీ ఆదాయం రూ.60 లక్షలకు పైగా ఉంటుందని, ఆమె వార్షిక ఆదాయం రూ.8 కోట్లు అని సమాచారం. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ 10 నటీమణులలో రష్మిక ఒకరు. ఒక్కో సినిమాకు దాదాపు రూ.4 నుంచి 5 కోట్లు తీసుకుంటుంది. యానిమల్ అద్భుతమైన విజయం తర్వాత ఆమె తన ఫీజును పెంచే అవకాశం ఉంది. రష్మిక మందన్న దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పలు ఆస్తులను కొనుగోలు చేసింది. ఆమెకు ముంబైలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్, రూ. 8 కోట్ల విలువైన బంగ్లా , గోవా, కూర్గ్, హైదరాబాద్‌లలో ఇతర అద్భుతమైన ఆస్తులు ఉన్నాయి.

రష్మిక మందన్న కార్ కలెక్షన్..

  • రేంజ్ రోవర్ స్పోర్ట్
  • ఆడి Q3
  • మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్
  • టయోటా ఇన్నోవా
  • హ్యుందాయ్ క్రెటా

అభిమానులంతా నేషనల్ క్రష్ అని ముద్దుగా పిలుచుకుంటారు. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కేవలం సినిమాలతోనే కాకుండా యాడ్స్, బిజినెస్ రంగాల్లోనూ రష్మిక భారీగానే సంపాదిస్తుంది. ప్రస్తుతం ఆమె బన్నీ జోడిగా పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అలాగే తెలుగులో మరిన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు సైతం ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.