Ram Charan: రామ్ చరణ్ మిస్సయ్యారు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన మహేష్.. ఏ మూవీ అంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా ఇది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఓ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని చరణ్ మిస్సయ్యారని మీకు తెలుసా..

Ram Charan: రామ్ చరణ్ మిస్సయ్యారు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన మహేష్.. ఏ మూవీ అంటే..
Ram Charan, Mahesh Babu

Updated on: Aug 26, 2025 | 6:33 PM

సినిమా ప్రపంచంలో ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటారు డైరెక్టర్. ఏ స్టోరీ ఏ హీరోకు సెట్ అవుతుందని ముందే ఊహించుకుంటారు. కానీ అనుహ్యంగా ఒక హీరో చేయాల్సిన కథతో మరో హీరో హిట్టు అందుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక హీరో మిస్సైన ప్లాప్ మరో హీరో ఖాతాలో పడుతుంది. ఎందుకంటే ఒక్కో హీరో అంచనా ఒక్కో విధంగా ఉంటుంది. కొన్నిసార్లు రెగ్యులర్ స్టోరీస్ వరుసగా రావడంతో రిజెక్ట్ చేసిన సందర్బాలు ఉన్నాయి. అలాగే సినిమా కథ నచ్చినప్పటికీ డేట్స్ అడ్జస్ట్ అవ్వక సినిమాను వదిలేసుకుంటారు. అయితే పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారని మీకు తెలుసా.. ?

ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..

ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు చరణ్. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్న చరణ్.. కెరీర్ మొదట్లో అనేక సినిమాలను వదిలేసుకున్నారు. డేట్స్ అడ్జస్ట్ కాకుండా.. కథ నచ్చకపోవడంతో పలు హిట్స్ మిస్సయ్యారు. అలా చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ అందుకున్నారు. అదే శ్రీమంతుడు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్టింది. వరుసగా ప్లాపులతో సతమతమవుతున్న మహేష్ ఖాతాలో శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..

ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..

శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం మహేష్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..