Rajinikanth: షాకిస్తోన్న రజినీకాంత్ రెమ్యునరేషన్.. జైలర్ 2కు ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడు పదుల వయసులోనూ బ్యా్క్ టూ బ్యా్క్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవలే లాల్ సలామ్ సినిమాతో థియేటర్లలో సందడి చేసిన తలైవా.. ఇప్పుడు కూలీ, జైలర్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా రజినీ రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇంతకీ తలైవా ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా.. ?

Rajinikanth: షాకిస్తోన్న రజినీకాంత్ రెమ్యునరేషన్.. జైలర్ 2కు ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే..

Updated on: May 12, 2025 | 7:11 PM

ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు సూపర్ స్టా్ర్ రజినీకాంత్. చివరగా జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తలైవా.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని నెలలుగా కూలీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన జైలర్ సినిమా సీక్వెల్ సైతం చేయనున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ తెరకెక్కించిన జైలర్ చిత్రం 2023లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రజనీకాంత్‌తో పాటు వినాయకన్, రమ్య కృష్ణన్, తమన్నా భాటియా, వసంత్ రవి, సునీల్, యోగి బాబు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

జైలర్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం కూలీ చిత్రీకరణలో బిజీగా ఉన్న రజినీ.. త్వరలోనే జైలర్ 2 చిత్రంలో నటించనున్నారు. అయితే ఈ సినిమాకు రజినీ ఏకంగా రూ.230 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

మరోైపు జైలర్ 2లో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో నటించనున్నారు. ఇందుకు రూ.50 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే జైలర్ 2 నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..