Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

సాధారణంగా సినిమాల్లో నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి జనాలు అంతగా పట్టించుకోరు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా సీనియర్ స్టార్ హీరోస్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ మీకు తెలుసా.. ? ఇదివరకు 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్ నటించిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో మీకు తెలుసా.. ?

Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Lingaa Movie

Updated on: Oct 31, 2025 | 4:50 PM

ప్రస్తుతం సినీరంగుల ప్రపంచంలో స్టార్ హీరోస్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఆరు పదులు, ఏడు పదుల వయసులోనూ అటు సినిమాలు, ఇటు ఫిట్నెస్ విషయంలో కుర్ర హీరోలకు గట్టిపోటి ఇస్తున్నారు. అయితే మీకు తెలుసా.. ? సినియర్ హీరోలకు జతగా యంగ్ హీరోయిన్స్ జతకట్టిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. సినిమా పరిశ్రమలో హీరోహీరోయిన్స్ వయసు వ్యత్సాసం గురించి అప్పుడప్పుడు చర్చ జరుగుతుంది. కొన్నిసార్లు విమర్శలు సైతం వస్తుంటాయి. మరికొన్ని సందర్భాల్లో అదేచిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్అవుతుంటాయి. ఇటీవల సికిందర్ సినిమాల సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటించడంపై ఏజే డిఫరెన్స్ అంటూ ట్రోల్స్ జరిగాయి. దీంతో విమర్శలపై గట్టిగానే స్పందించారు సల్మాన్. కానీ గతంలో 64 ఏళ్ల స్టార్ హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్ నటించిన సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి :  Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..

ఇంతకీ ఆ సినిమా పేరెంటీ.. ? నటీనటులు ఎవరో తెలుసుకుందామా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోహీరోయిన్స్ ఎవరో కాదండి. సూపర్ స్టార్ రజినీకాంత్.. హీరోయిన్ సోనాక్షి సిన్హా. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా లింగా. డైరెక్టర్ కె. ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2014లో విడుదలై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా సమయంలో రజినీ వయసు 64 సంవత్సరాలు.. కాగా.. సోనాక్షి వయసు కేవలం 27 సంవత్సరాలు కావడం గమనార్హం. అయినప్పటికీ వీరిద్దరి జోడి తెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రజినీకాంత్ వయసు 74 సంవత్సరాలు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. చివరగా కూలీ చిత్రంలో కనిపించారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషించారు. రూ.350 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నివేదికల ప్రకారం ఈ సినిమాకు రజినీ రూ.150 కోట్లు పారితోషికం తీసుకున్నారు. మరోవైపు ఇప్పుడు జైలర్ 2 చిత్రీకరణంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..

Rajinikanth, Sonakshi Sinha

ఇవి కూడా చదవండి : ఎన్నాళ్లకు కుదిరిందయ్యో.. అప్పుడు ప్రేయసిగా. ఇప్పుడు స్పెషల్ సాంగ్‏లో