Mirai Movie: ఆ ఒక్క కారణంతో ‘మిరాయ్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

'హనుమాన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జా నటించిన చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ లో మంచు మనోజ్ విలన్ గా నటించాడు. రుతిక హీరోయిన్ గా నటించగా, సీనియర్ హరోయిన్ శ్రియ మరో కీలక పాత్రలో మెరిసింది.

Mirai Movie: ఆ ఒక్క కారణంతో మిరాయ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
Mirai Movie

Updated on: Sep 12, 2025 | 9:17 PM

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ సినిమా మిరాయ్. హనుమాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక భారీ అంచనాల మధ్య శుక్రవారం (సెప్టెంబర్ 12) న పాన్ ఇండియా లెవెల్ రిలీజైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. తేజ సజ్జా నటన అదిరిపోయిందని, మంచు మనోజ్ విలన్ గా విశ్వరూపం చూపించాడని రివ్యూలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరలవుతోంది. అదేంటంటే.. ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ కథని మూడేళ్ల క్రితమే సిద్ధం చేసుకున్నాడట. అయితే సినిమాటోగ్రాఫర్ గా ఉన్న తనకు దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడానికి అప్పట్లో చాలా మంది హీరోలు సంకోచించారట. అయినా నేచురల్ స్టార్ నానీని ఒప్పించి ఎలాగైనా అతనితోనే మిరాయ్ సినిమాను తెరకెక్కిద్దామని కార్తీక్ రెడీ అయ్యాడట. అయితే ఎందుకో గానీ నాని ఈ మూవీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట.

నాని ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో మళ్లీ కొన్నాళ్లు సైలెంట్ గా తన సినిమాటోగ్రఫీ పనులు చేసుకున్నాడట కార్తీక్ ఘట్టమనేని. అదే సమయంలో ‘హనుమాన్’ తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న తేజ సజ్జా ఈ డైరెక్టర్ కు కనిపించాడట. వెంటనే అతన్ని కలిసి ఈ సినిమా స్టోరీ ని వినిపించాడట. తేజ కూడా ఒకే చెప్పడంతో మిరాయ్ సినిమా పట్టాలెక్కిందట. అయితే నాని ఈ సినిమా చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదేమో మరి?

ఇవి కూడా చదవండి

తేజ సజ్జా ట్వీట్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ సినిమాలో జగపతి బాబు, జయరాం, తంజా కెల్లర్, రాజేంద్రనాత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గౌరా హరి స్వరాలు సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.