Megastar Chiranjeevi: బుల్లితెరపై అలరించిన మెగాస్టార్.. చిరంజీవి నటించిన సీరియల్ ఏంటో తెలుసా ?..

|

Apr 19, 2023 | 9:05 AM

యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మరోసారి అలరిస్తున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీదున్నారు. ప్రస్తుతం ఆయన భోళా శంకర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే చిరుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో తెగ వైరలవుతుంది.

Megastar Chiranjeevi: బుల్లితెరపై అలరించిన మెగాస్టార్.. చిరంజీవి నటించిన సీరియల్ ఏంటో తెలుసా ?..
Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి… సినీపరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు స్పూర్తి. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో సినీరంగంలోకి నటుడిగా అరంగేట్రం చేసిన ఆయన.. ఇవాళ మెగాస్టార్‏గా తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. ముందుగా విలన్ పాత్రలతో మెప్పించిన ఆయన.. పునాది రాళ్లు సినిమాతో హీరోగా మారారు. ఎన్నో కష్టాలను.. మరెన్నో అవమానాలను ఎదుర్కొని ఇప్పుడు తనకోసం ప్రాణాలిచ్చే అభిమానులను సంపాదించుకున్నారు. తన కెరియర్ లో అనేక ప్రయోగాలు చేసి హిట్స్ అందుకున్న చిరు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటుతున్నారు. యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మరోసారి అలరిస్తున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీదున్నారు. ప్రస్తుతం ఆయన భోళా శంకర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే చిరుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో తెగ వైరలవుతుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి తొలి నాళ్లల్లో వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా సందడి చేశారు. అంటే రియాల్టీ షో.. టాక్ షోలలో కనిపించడం కాదు.. ఏకంగా ఓ సీరియల్లో నటించారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి స్టార్స్ ఏలేస్తున్న సమయంలో అప్పటి నిర్మాతలు కొత్త హీరోలను తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. అలాంటి సమయంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండాని చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు చిరు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనవరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. అదే సమయంలో ‘రజిని’ అనే హిందీ సీరియల్లోనూ నటించారు చిరు.

ఆ సీరియల్లో కేవలం అతిథి పాత్రలో కనిపించారు చిరు. ఆ తర్వాత కూడా ఆయన పాత్ర ఉన్నప్పటికీ సినిమా అవకాశం రావడంతో సీరియల్ నుంచి తప్పుకున్నారట చిరు. ఇక ఆ తర్వాత సినీరంగంలో ఆయన క్రేజ్ మారిపోయింది. మొదటి చిత్రం నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ మరో కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ముందుంటారు చిరు. ప్రస్తుతం ఆయన భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా, కీర్తి సురేష్ కీలకపాత్రలలో నటిస్తున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.