Cinema: రూ. 100 కోట్లతో తీసిన సినిమా.. కట్ చేస్తే అల్ట్రా డిజాస్టర్.. కేవలం 20 టికెట్లు మాత్రమే తెగాయ్

కొన్ని సినిమాలపై రిలీజ్ కు ముందు భారీ అంచనాలు ఉంటాయి. అయితే తీరా రిలీజయ్యాక ఆ అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోక్కా బోర్లాపడుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇదొక బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు.

Cinema: రూ. 100 కోట్లతో తీసిన సినిమా.. కట్ చేస్తే అల్ట్రా డిజాస్టర్.. కేవలం 20 టికెట్లు మాత్రమే తెగాయ్
Dhaakad Movie

Updated on: Feb 26, 2026 | 6:56 PM

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడంటే ఎంపీగా బిజీగా ఉన్నారు.. కానీ మొన్నటి వరకు ఆమె వరుసగా సినిమాలు చేసింది. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కే పరిమితమైన కంగనా ఆ తర్వాత రూటు మార్చింది. కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఓటు వేసింది. అందులో భాగంగానే ఫ్యాషన్, క్వీన్, మణికర్ణిక, తలైవి వంటి సూపర్ హిట్ సినిమాల్లో లీడ్ రోల్ పోషించింది కంగనా. అయితే అదే ఊపులో ఆమె ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా చేసింది. రిలీజ్ కు ముందు ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసి హాలీవుడ్ లెవెల్ లో ఉందనుకున్నారు. పైగా 100 కోట్ల బడ్జెట్ మూవీ కావడంతో రిలీజ్ కు ముందే ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ తీరా రిలీజయ్యాక మాత్రం ఈ మూవీ అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది. కంగనా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఇంతకీ ఆ మూవీ ఏదనుకుంటున్నారా? 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధాకడ్.

రజనీష్ ఘై దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధాకడ్’ చిత్రాన్ని సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కంగనా ఈ చిత్రంలో ఒక ఏజెంట్‌గా నటించింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా రిజల్ట్ చూసి చిత్ర బృందంతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా షాక్ అయ్యింది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా కేవలం రూ. 3.30 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. సినిమాపై విపరీతమైన నెగటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను అసలు పట్టించుకోలేదు. మల్టీప్లెక్స్‌లలో సైతం ఒక షోకు కేవలం 20 నుంచి 30 మంది ప్రేక్షకులు మాత్రమే ఉన్నారంటే ఈ సినిమా పరిస్థితి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆడియెన్స్ లేకపోవడంతో చాలా చోట్ల రెండో రోజే ఈ సినిమా షోలను రద్దు చేసి ఇతర సినిమాలను ప్రదర్శించారు. ఇక ఓవరాల్ గా ఈ సినిమా వసూళ్లు కనీసం రూ. 10 కోట్ల మార్కును కూడా దాటలేకపోయాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు.

100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్, అందులో నూ స్టార్ హీరోయిన్ ను పెట్టి తీసిన ధాకడ్ సినిమాకు కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. ఈ మూవీ బాలీవుడ్ చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us