Jr.NTR: వామ్మో.. ఇంత రేట్ ఏంది భయ్యా.. ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే ఫ్యూజులవుట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలోని అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ హీరోకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం హిందీలో వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు తారక్.

Jr.NTR: వామ్మో.. ఇంత రేట్ ఏంది భయ్యా.. ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే ఫ్యూజులవుట్..
Jr.ntr

Updated on: Apr 19, 2025 | 5:07 PM

జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత అభిమాన నటులలో తారక్ ఒకరు. దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ఇటీవల దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు తారక్. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బీటౌన్ హీరో హృతిక్ రోషన్ సైతం ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అలాగే ఇటీవలే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటించే ప్రాజెక్ట్ సైతం పట్టాలెక్కింది. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా.. వచ్చే వారంలో తారక్ సైతం జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న తారక్.. ఇటీవలే మ్యాడ్ స్కైర్ మూవీ ఈవెంట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన మ్యాడ్ స్కైర్ మూవీ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా వచ్చారు తారక్. ఈ వేడకలో స్టైలీష్ లుక్స్ తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు తారక్. ముఖ్యంగా ఈ వేడుకలో ఎన్టీఆర్ ధరించిన రెడ్ అండ్ బ్లాక్ చెక్స్ షర్ట్ కుర్రాళ్లకు తెగ నచ్చేసింది.

దీంతో ఇప్పుడు ఆ షర్ట్ గురించి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. తాజాగా ఈ షర్ట్ ధర తెలిసి షాకవుతున్నారు. మ్యాడ్ స్కైర్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన షర్ట్ ALL SAINTS బ్రాండ్ నుంచి ఎంపిక చేసుకున్నారు. ఈ షర్ట్ ధర ఏకంగా రూ. 14,999 ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క షర్ట్ ధర దాదాపు రూ.15 వేలు ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..