13 ఏళ్లకు హీరోయిన్.. 19ఏళ్లకే కనబడకుండాపోయింది.. ఇప్పుడు సినిమాలు మానేసి

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

13 ఏళ్లకు హీరోయిన్.. 19ఏళ్లకే కనబడకుండాపోయింది.. ఇప్పుడు సినిమాలు మానేసి
Mahesh Babu

Updated on: Sep 17, 2025 | 10:33 AM

సినిమాల్లో హీరోయిన్ గా రాణించడం అంటే అంత ఈజీ కాదు. హీరోయిన్ గా రాణించడం తేలికైన విషయం కాదు. చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ గా రాణించలేక సెకండ్ హీరోయిన్స్ గా చేస్తుంటారు. మరికొంతమంది మాత్రం యంగ్ హీరోలతో జోడీ కడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ హీరోయిన్ 13 ఏళ్లకు ఇండస్ట్రీలోకి వచ్చింది. అలాగే 19 ఏళ్లకే ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యింది. అంతే కాదు చేసింది తక్కువ సినిమాలే అయినా అతన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ నటించింది ఈ అమ్మడు. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్‌కు లవర్‌గా.. హరికృష్ణకు కోడలిగా నటించిన ఏకైక హీరోయిన్.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ పేరు మయూరి కాంగో. టాలీవుడ్ , బాలీవుడ్ లో సినిమాలు చేసింది ఈ చిన్నది. మయూరి తన 13 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఎక్కువ కాలం సినిమాల్లో రాణించలేకపోయింది. సినిమాలకు దూరం అయిన ఈ అమ్మడు ఇప్పుడు గూగుల్ లో మంచి పొజిషన్ లో ఉంది.

ఇది కూడా చదవండి : మిరాయ్‌లో అదరగొట్టిన ఈ లేడీ విలన్ ఎవరో తెలుసా.? అమ్మబాబోయ్ ఈమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..

మయూరి కాంగో మహేష్ బట్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే సినిమాల్లోకి వచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వంశీ అనే సినిమాలో నటించింది.  అంతగా సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్ కు దూరం అయ్యింది. ఆతర్వాత హిందీలో మయూరి కాంగో నర్గీస్, తోడా ఘం తోడా ఖుషీ, డాలర్ బాబు, కిట్టి పార్టీ లాంటి టెలివిజన్ షోలను కూడా చేసింది. చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. మయూరి కాంగో పెర్ఫార్మిక్స్ అనే కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేసింది. 2019లో ఆమె గూగుల్ ఇండియాలో ఇండస్ట్రీ హెడ్‌గా చేరింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : రెండుసార్లు ప్రేమలో పడింది.. ఇద్దరు పిల్లలకు తల్లయింది.. అప్పుడు తెలుగులో తోప్.. కానీ ఇప్పుడు ఇలా..

Actress

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.