ఆనంద్ సినిమాలో చిచ్చరపిడుగు గుర్తుందా..? సినిమాలు మానేసి ఇప్పుడేం చేస్తుందంటే

టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడు అంటే టక్కున చెప్పే పేరు శేఖర్ కమ్ముల.. ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది . శేఖర్ కమ్ముల సినిమాలు చాలా క్లాస్ గా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల దిట్ట. ఆయన చేసిన సినిమాలు మన ఇంట్లోనో.. లేదా మన పక్క ఇంట్లోనో జరిగిన కథల్లానే ఉంటాయి.

ఆనంద్ సినిమాలో చిచ్చరపిడుగు గుర్తుందా..? సినిమాలు మానేసి ఇప్పుడేం చేస్తుందంటే
Anand

Updated on: Sep 15, 2025 | 8:08 AM

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. క్లాసిక్ సినిమాలకు శేఖర్ కమ్ముల పెట్టింది పేరు. శేఖర్ కమ్ముల సినిమా అంటే చాలు ఎలాంటి అంచనాలు, భారీ హైప్ అవసరం లేదు.. ఫ్యామిలీతో కలిసి వెళ్లి హాయిగా సినిమా చూసేయ్యొచ్చు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆయన రాసుకునే కథలు  చాలా నేచురల్ గా మన ఇంట్లోనో.. లేక మన వీదిలోనో జరిగే సంఘటనల్లా అనిపిస్తాయి శేఖర్ కమ్ముల సినిమాలు. ఇక అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములది డిఫరెంట్ స్టైల్.. అలాగే ఇటీవలే కుబేర లాంటి విభిన్న కథను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు శేఖర్.

ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్‌గా కమిట్‌మెంట్‌ అడుగుతున్నారు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

కెరీర్ లో వరుస హిట్స్ అందుకున్న శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన మంచి కాఫీలాంటి సినిమా ఆనంద్. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఇది. రాజా, కమిలిని ముఖర్జీ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లు గా నటించిన చిన్నారి గుర్తుందా..? పై ఫొటోలో కనిపిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఇవి కూడా చదవండి

ఇద్దరు స్టార్ హీరోలు.. పెద్ద హీరోయిన్.. రూ.200కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే భారీ డిజాస్టర్

ఆ చిన్నారి పేరు భకిత. ఇప్పుడు ఆమె హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఈ అమ్మడు సినిమాలకు తగ్గించింది. ఆమె ప్రస్తుతం సమాజ సేవలో బిజీగా ఉంది. భకిత తన 17 సంవత్సరం నుండే మహిళల హక్కుల కోసం, సమాజంలో ఆడవాళ్లకు మగాళ్ల మాదిరిగా సమన హక్కులు కల్పించాలని..అలాగే ఆడపిలల్లపై  దాడులు ,అత్యాచారాలు జరగకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని భకిత పోరాటం చేస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడు చాలా అందంగా ఉంది కానీ ఆమె సినిమాల్లో ప్రయత్నించకుండా సమాజ సేవ చేస్తోంది. తాజాగా అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భకిత లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

బాబోయ్.. బీభత్సం..! రవితేజ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! ఈ దెబ్బతో హీరోయిన్స్ అవుట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.