Kaniha: నా ఆటోగ్రాఫ్ మూవీలోని ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? గ్లామర్ డోస్ పెంచేసింది రచ్చ చేస్తోందిగా..
ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో భూమిక, గోపిక, కనిక ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు.
మనసుకు హత్తుకునే సినిమాలు చాలానే మన టాలీవుడ్ లో వచ్చాయి. అలాంటి సినిమాల్లో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ఒకటి. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్. ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో భూమిక, గోపిక, కనిక ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో కథ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలను.. స్కూల్ లైఫ్, కాలేజ్ డేస్, జాబ్ స్ట్రగుల్స్, ఆ తర్వాత పెళ్లి ఇలా అన్ని ఫేజ్ లను చూపించారు.
ఇక ఈ సినిమాలో చివరిగా రవితేజ పెళ్లి చేసుకున్న హీరోయిన్ గుర్తుందా..? ఆమె పేరు కనిక. చూడచక్కని రూపంతో ఆకట్టుకుంది ఈ భామ. అయితే ఈ భామ తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది కూడా..
ప్రస్తుతం ఈ భామ ఎలా ఉందో తెలుసా..? కనిక అసలు పేరు దివ్య సుబ్రహ్మణ్యం. కనికాను కనిహ అని కూడా పిలుస్తుంటారు. 2001లో మిస్ చెన్నై అందాల పోటీలో కనిక విజేతగా నిలిచింది . ఈ భామ శ్రీకాంత్ నటించిన ఒట్టేసి చెబుతోన్నా అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కనికా తెలుగు కన్నడ , మలయాళ సినిమాల్లో నటించింది. అలాగే కొన్ని తమిళ్ సినిమాల్లోనూ నటించింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంది. కానీ ఆమె సినిమాల్లో కంటిన్యూ అయ్యింది. కనికా హీరోయిన్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. ప్లేబ్యాక్ సింగర్ గా.. టీవీ హోస్ట్ గా కూడా చేసింది. తాజాగా ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వారిలా అవుతున్నాయి. కనిక సోషల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గ్లామర్ డోస్ పెంచేసి కుర్రకారు మతిపోగొడుతోంది కనిక.
View this post on Instagram