Pawan Kalyan: పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ.. సుజీత్ చిత్రానికి పవర్ స్టార్ అన్ని రూ. కోట్లు తీసుకుంటున్నారా.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 30వ తేదీ నుంచి ప్రారంభమైంది. సాహో చిత్రాన్ని అత్యంత భారీగా తెరకెక్కించిన సుజిత్ పవన్‌ను డైరెక్ట్ చేస్తుండడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే చిత్రానికి సంబంధించి భారీ బజ్ ఏర్పడింది.
ఈ సినిమాకు సంబంధించి ప్రతీ రోజూ ఏదో ఒక అప్‌డేట్ సందడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త వార్త నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. వపన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోన్న ఈ సినిమాకు ఏకంగా రూ. 175 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. పవన్ రూ. 75 కోట్లతో పాటు సినిమా లాభాల్లోనూ వాటా తీసుకోనున్నారని సమాచారం.
ఈ లెక్కన పవన్ కళ్యాణ్ సుజిత్ సినిమా కోసం ఏకంగా రూ. వంద కోట్లకుపైగా తీసుకోనున్నారని టాక్ నడుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమా కనీసం రూ. 200 కోట్లకు పైగా మార్కెట్ చేస్తేనే లాభాల బాట పడుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఓజీ మూవీని పాటలు లేకుండా కేవలం గంటన్నర నిడివితోనే ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఇంత భారీ హంగుల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..