Pia Bajpiee: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రంగం బ్యూటీ.. చూస్తే అవాక్ అవ్వాల్సిందే
కో అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాను తెలుగులో రంగం అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. జీవ హీరోగా నటించిన ఈ సినిమాలో కార్తీక హీరోయిన్ గా నటించింది. అజ్మల్, కోటశ్రీనివాస్ కీలక పాత్రలో నటించారు.

అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్స్ గా నిలిచిన సినిమాల్లో తమిళ్ డబ్బింగ్ మూవీ రంగం ఒకటి. 2011 లో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కింది. కో అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాను తెలుగులో రంగం అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. జీవ హీరోగా నటించిన ఈ సినిమాలో కార్తీక హీరోయిన్ గా నటించింది. అజ్మల్, కోటశ్రీనివాస్ కీలక పాత్రలో నటించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కేవి ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రెండు ఫిలింఫేర్ సౌత్ అవార్డులు, మూడు విజయ్ అవార్డులు , రెండు సైమా అవార్డులు అలాగే నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ పేరు పియా బాజ్ పాయ్.
ఈ సినిమాలో హీరోని లవ్ చేసే పాత్రలో నటించి మెప్పించింది పియా. ఇక ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగులో దళం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు ఈ అమ్మడు తమిళ్ హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. అడపాదడపా మలయాళంలో సినిమాలు చేస్తోంది పియా. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అవుతారు. అంత అందంగా ఉంది ఈ చిన్నది. మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram




