Devara : బాబోయ్ అన్ని కోట్లా..! దేవర కోసం అనిరుద్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా. ?
అనిరుధ్ సంగీతంతో ఫ్లాప్ సినిమాని కూడా ఎలివేట్ చేయగలడు. సినిమా ఎలా ఉన్నప్పటికీ అనిరుద్ సంగీతం ఆ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తుంది. తక్కువ సమయంలోనే అనిరుద్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. తమిళ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు అనిరుద్.
అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ ఫేవరెట్‌గా మారిపోయాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. గతంలో ఏఆర్ రెహమాన్ కోసం దర్శకులు, నిర్మాతలు నెలల తరబడి ఎదురుచూస్తే ఇప్పుడు అనిరుధ్ రవిచందర్ కోసం ఎదురుచూస్తున్నారు దర్శక నిర్మాతలు. అనిరుధ్ సంగీతంతో ఫ్లాప్ సినిమాని కూడా ఎలివేట్ చేయగలడు. సినిమా ఎలా ఉన్నప్పటికీ అనిరుద్ సంగీతం ఆ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తుంది. తక్కువ సమయంలోనే అనిరుద్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. తమిళ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు అనిరుద్.
ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
రజనీకాంత్ సినిమా ‘జైలర్’ బ్లాక్ బస్టర్ అయింది, ఆ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన రజనీకాంత్.. ‘జైలర్’ సినిమాను డబ్బింగ్ చెబుతూ ఓ మాములు సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని ఫీలయ్యా.. కానీ అనిరుద్ సంగీతంతో సినిమా పెద్ద హిట్ అయ్యిందని అన్నారు. అది నిజమేనని సినిమా చూసిన వాళ్ళు కూడా అన్నారు. షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా కూడా అంతే . కమల్ హాసన్ ‘విక్రమ్’ చిత్రానికి అనిరుధ్ రూపొందించిన థీమ్ మ్యూజిక్ , సూర్య ఎంటర్ అయినప్పుడు చివరలో ఇచ్చిన సంగీతం సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.
ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కు కూడా అనిరుద్ సంగీతం అందించారు. ససెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఒకటి జూనియర్ ఎన్టీఆర్, మరొకటి అనిరుధ్ సంగీతం అనే చెప్పాలి. ఈ రెండూ సినిమాను బ్లాక్ బస్టర్ దిశగా నడిపించాయి. మొదట్లో దేవర మ్యూజిక్ పై అభిమానులు, ప్రేక్షకుల్లో అనుమానాలు ఉండేవి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి. దేవర సినిమాను తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవల్ కూడా తీసుకెళ్లాడు అనిరుద్. 33 ఏళ్ల అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడు. ఏఆర్ రెహమాన్ కంటే అనిరుధ్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడు. అనిరుధ్ ఒక్కో సినిమాకు 12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. దేవర సినిమాకు కూడా అనిరుద్ రూ.12కోట్లు అందుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ప్రతి సినిమాకు పది కోట్లు తీసుకుంటున్నాడు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ 8 కోట్లు, కీరవాణికి దాదాపు 5 నుండి 6 కోట్లు అందుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి