Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్సాదియ్యా..! మహేష్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు అందుకుని.. స్టార్ హీరోల సరసన నటించి ఎనలేని స్టార్‌డమ్ సంపాదించింది సాక్షి శివానంద్. 90’sలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువై.. గ్లామరస్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించడమే కాకుండా.. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో జతకట్టి ఆడిపాడింది.

తస్సాదియ్యా..! మహేష్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Maheshbabu
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 13, 2025 | 5:13 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కొంతమంది అసలు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఇక చాలా మందిని మనం మర్చిపోయాం కూడా. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన భామల్లో సాక్షి శివానంద్ ఒకరు. అప్పట్లో తన అందంతో వయ్యారంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ భామ. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యింది సాక్షి. ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లతో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా నటించింది ఈ భామ.

తెలుగు, తమిళ్ ,కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన సాక్షి శివానంద్.. 2014తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. సాక్షి శివానంద్ 1996లో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆమె కెరీర్ ప్రారంభంలో, ఆమె ఆదిత్య పంచోలి -నటించిన జంజీర్ (1998)లో నటించింది. ఆ తర్వాత ఆమె కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత ఏమైందో ఏమో సడెన్‌గా పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. జగపతి బాబుతో సముద్రం సినిమాలో, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాలలో హీరోయిన్‌గా నటించింది సాక్షి. అప్పట్లో ఈ అమ్మడు హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లోనే బికినిలో కనిపించి అందరిని షాక్ కు గురిచేసింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలని నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మడు ఎలా ఉందో తెలుసా.. ఆమె ను అసలు గుర్తుపట్టలేరు.

Sakshi Shivanand

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..