Goutham Raju: కమెడియన్ గౌతమ్ రాజు కొడుకును చూశారా..? ఇండస్ట్రీలో క్రేజీ హీరో..

|

Sep 14, 2024 | 2:16 PM

బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, కృష్ణ భగవాన్, ఎంఎస్ నారాయణ, దర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలా చాలా మంది కమెడియన్స్ తమ నటనతో ప్రేక్షకులను నవ్వించారు. అందులో గౌతమ్ రాజు ఒకరు. తెలుగు ప్రజలకు గౌతమ్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వందల సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించాడు.

Goutham Raju: కమెడియన్ గౌతమ్ రాజు కొడుకును చూశారా..? ఇండస్ట్రీలో క్రేజీ హీరో..
Actor
Follow us on

సినిమాల్లో కమెడియన్స్ పాత్ర గురించి చెప్పక్కర్లేదు. కథను బోర్ కొట్టకుండా జనాలకు వినోదాన్ని అందించడంలో హాస్యనటుల పాత్ర ఎక్కువ. కొన్నిసార్లు హాస్యనటులు స్టార్ హీరోస్ ముందు చిన్నపిల్లలా కూడా నటిస్తుంటారు. అందుకే అన్ని భాషల సినీ ఇండస్ట్రీలలో కమెడియన్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే సినీరంగంలో తమ కామెడీ టైమింగ్, నటనతో అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్యనటులు భారీగానే పారితోషికం కూడా తీసుకుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, కృష్ణ భగవాన్, ఎంఎస్ నారాయణ, దర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలా చాలా మంది కమెడియన్స్ తమ నటనతో ప్రేక్షకులను నవ్వించారు. అందులో గౌతమ్ రాజు ఒకరు. తెలుగు ప్రజలకు గౌతమ్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వందల సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించాడు.

గౌతంరాజు 1984లో వసంతగీతం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఇంద్రనే చంద్ర, కూలీ నెం.1 సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించాడు. 90వ దశకంలో కమెడియన్లుగా ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, రాజేంద్ర గజేంద్రుడు చిత్రాల్లో నటించాడు. 2000లలో, గౌతం రాజు ప్రతి సంవత్సరం 5-6 చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. తనదైన కామేడీతో కడుపుబ్బా నవ్వించాడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్, అటు సినిమాలు చేస్తున్నాడు గౌతమ్ రాజు. అయితే మీకు తెలుసా.. ఆయన తనయుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో.

ఇవి కూడా చదవండి

గౌతమ్ రాజు తనయుడు కృష్ణారావు అలియాస్ కృష్ణ. తన తండ్రి నిర్మాణంలోనే సూపర్ మార్కెట్ రావు అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఆ మూవీ విజయాన్ని అందుకోలేదు. దీంతో కృష్ణకు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నా మాటే వినవ చిత్రంతో మరోసారి హీరోగా అలరించాడు. కానీ ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. అటు హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. గౌతంరాజు ఇప్పటివరకు 350కి పైగా సినిమాలు చేశారు. కొన్ని సినిమాల్లో విలన్‌గా కూడా నటించాడు. గౌతంరాజుకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.