
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న చిత్రాల్లో మగధీర ఒకటి. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో చెర్రీ నటించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. 2009లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక చెర్రీ సినీ ప్రయాణంలో మగధీర ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో దివంగత నటుడు శ్రీహరి, శరత్ బాబు, దేవ్ గిల్, రావు రమేశ్ కీలకపాత్రలలో నటించగా.. కాజల్ అగర్వాల్ కథానాయికగా కనిపించింది.
ఇందులో మిత్రవింద పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. ఈసినిమాతో కాజల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోవడవే కాకుండా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూకట్టాయి. నిజానికి ఈ సినిమా చేయాల్సింది కాజల్ కాదట. మరో స్టార్ హీరోయిన్ అని టాక్ వినిపిస్తోంది. ఆ ముద్దుగుమ్మ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో కాజల్ వద్దకు చేరడం.. ఈ చిత్రంలో కథానాయికగా అలరించిన కాజల్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోవడం చక చకా జరిగిపోయాయి.
అయితే ఈ సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకున్న బ్యూటీ ఎవరంటే హీరోయిన్ అనుష్క శెట్టి. ఈ సినిమాలో మిత్రవింద పాత్రకు అనుష్క సరిగ్గా సెట్ అవుతుందని అనుకున్నారట రాజమౌళి. అంతకు ముందు జక్కన్న దర్శకత్వంలో విక్రమార్కుడు సినిమాలో నటించింది అనుష్క. దీంతో మగధీర చిత్రంలో రాజకుమారి పాత్రకు ఆమె బాగుంటుందని అనుకున్నారట. ఇక ఇదే విషయమై అనుష్కను సంప్రదించారట. అయితే అప్పట్లో చరణ్ కాస్త టీనేజ్ కుర్రాడిగా ఉండడంతో ఇద్దరికి సెట్ కాదని ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట అనుష్క.. ఇక ఆ తర్వాత కాజల్ ను తీసుకున్నారట జక్కన్న. దీంతో టాలీవుడ్ చందమామ ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ పడింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.