Tollywood : రాజ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. 21 ఏళ్లకే పెళ్లి విడాకులు.. ఇప్పుడు స్టార్ హీరోతో రెండో పెళ్లి..
పాన్ ఇండియా సినీపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సినీప్రియుల హృదయాలు గెలుచుకుంది. . ఆమె భారతీయ సినిమాల్లోని అత్యంత అందమైన నటీమణులలో ఒకరు. ఈ నటి తన అందంతో మాత్రమే కాకుండా తన నటనతో ప్రశంసలు అందుకుంది.

రాజకుటుంబంలో జన్మించిన ఓ అమ్మాయి.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాది, ఉత్తరాది భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. భారతీయ సినిమా ప్రపంచంలో తన నటనా నైపుణ్యంతో తనదైన ముద్రవేసిన అదితి రావు హైదరీ.. నిజానికి ఆమె రాజకుటుంబంతోపాటు.. నవాబుల వంశంలో జన్మించింది. 2006 మలయాళ చిత్రం ప్రజాపతి మూవీతో నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత హిందీలో ఢిల్లీ 6 సినిమాకు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళంలోనూ ఆమె నటించింది.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
కానీ ఆమె వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులతో నిండి ఉంది. 21 ఏళ్ల వయసులోనే సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. విడాకుల తర్వాత ఎంతో బాధపడ్డానని గతంలో తెలిపింది. ప్రస్తుతం ఇద్దరం స్నేహితులుగా ఉన్నామని తెలిపింది. విడాకుల తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న అదితి.. 2021లో తెలుగులో మహా సముద్రం సినిమాలో నటించింది. అదే సమయంలో హీరో సిద్ధార్థ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2024 సెప్టెంబర్ 16న పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
అదితి.. “రాక్‌స్టార్”, “మర్డర్ 3,” “వజీర్,” “పద్మావత్,” “కాట్రు వెలియిడై,” “సూఫియుం సుజాతయుమ్,” “మహా సముద్రం” వంటి చిత్రాలలో నటించింది. ఆమె చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి సిరీస్ లో నటించింది. ఇందులో నటనతోపాటు .. అందానికి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
