Uday Kiran: ఏంటీ.. ఈ టాలీవుడ్ స్టార్ సింగర్ ఉదయ్ కిరణ్ సిస్టరా..!!

|

Oct 30, 2024 | 11:26 AM

చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ వరుసగా సినిమాలు చేసి భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే లవర్ బాయ్ అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

Uday Kiran: ఏంటీ.. ఈ టాలీవుడ్ స్టార్ సింగర్ ఉదయ్ కిరణ్ సిస్టరా..!!
Uday Kiran
Follow us on

ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే ఎదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. మన ఇంట్లో సభ్యుడు. మనకు బాగా తేలినవాడు అనే భావన కలుగుతుంది. అలాగే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. స్టార్ హీరో గా రాణించాల్సిన వాడు అనుకోని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ వరుసగా సినిమాలు చేసి భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే లవర్ బాయ్ అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. వరుసగా చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతే కాదు.. అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయాడు ఈ స్టార్ హీరో..

ఇది కూడా చదవండి : వాయమ్మో.. ! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. ఎందుకు ఇలా

వరుస విజయాలను అందుకున్న ఉదయ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.. కెరీర్ పీక్ లో ఉండగానే ఉదయ్ పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగుంది అనుకునేలోగా ఉదయ్ కెరీర్ డల్ అవుతూ వచ్చింది. అతనికి సినిమాలు తగ్గడం మొదలయ్యాయి. చేసిన సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఉదయ్ డిప్రషన్ లోకి వెళ్ళాడు. ఆతర్వాత తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్. ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని విడిచి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

ఇది కూడా చదవండి :Sneha: నా ఫేవరెట్ హీరో అతనే.. ఓపెన్‌గా చెప్పిన స్నేహ.. ఆనందంలో ఫ్యాన్స్

అయితే ఉదయ్ కిరణ్ సిస్టర్ టాలీవుడ్ లో స్టార్ సింగర్ అని మీకు తెలుసా.? ప్రస్తుతం ఆమె సింగర్ గా రాణిస్తున్నారు. ఆమె ఎవరో కాదు పర్ణిక మన్య. ఈ చిన్నది సరిగమప షో ద్వారా సింగింగ్ కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది. పరారే,బ్రహ్మనందం డ్రామా కంపెనీ,తెలుగమ్మాయి, బాడీ గార్డ్, దేనికైనా రెడీ, గ్రీకు వీరుడు, బాహుబలి, రభస, కవచం, భీమ్లా నాయక్ ఇలా చాలా సినిమాల్లో పాటలు పాడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు చేస్తోంది. కాగా ఉదయ్ కిరణ్ పర్ణికకాకు కజిన్ బ్రదర్ అవుతాడు. ఉదయ్ తనకు పెద్దమ్మ కొడుకు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. పర్ణిక తండ్రి కూడా నటుడే.. ఆయన పేరు మన్య భాస్కర్. పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించాడు. ఉదయ్ కిరణ్ పేరు నేను ఇండస్ట్రీలో ఎక్కడ ఉపయోగించుకోలేదు. ఉదయ్ కూడా కష్టపడి వచ్చాడు. ఉదయ్ చిన్నప్పటి నుంచి తక్కువ మాట్లాడేవాడు. చాలా మంచోడు.. కానీ అతని అలా అవ్వడం చాలా బాధాకరం అని అన్నారు పర్ణిక.

ఇది కూడా చదవండి:Tollywood: ఏంటీ..! ఈ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరితో నటించందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.