AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ స్టార్ హీరోతో ప్రేమ, బ్రేకప్.. కట్ చేస్తే.. భర్త ఆస్తులు రూ.2800 కోట్లు.. ఇప్పుడేం చేస్తుందంటే..

భారతీయ సినీ పరిశ్రమలో ఆమె తోపు హీరోయిన్. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. బాడీ షేమింగ్ కామెంట్స్.. అవమానాలు సహించింది. అదే కారణాలతో ఎన్నో ఆఫర్స్ కోల్పోయింది. కట్ చేస్తే.. రూ.2800 కోట్ల ఆస్తులు కలిగిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. సినిమాలతో కాకుండా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: ఆ స్టార్ హీరోతో ప్రేమ, బ్రేకప్.. కట్ చేస్తే.. భర్త ఆస్తులు రూ.2800 కోట్లు.. ఇప్పుడేం చేస్తుందంటే..
Shilpa Shetty
Rajitha Chanti
|

Updated on: May 22, 2025 | 4:09 PM

Share

ఒకప్పుడు భారతీయ సినీరంగంలో అగ్ర హీరోయిన్లలో ఆమె ఒకరు. 18 ఏళ్ల వయసులోనే తోపు నటి. హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. అందంగా లేదని.. కలర్ తక్కువ ఉందంటూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. దీంతో ఆమెను చాలా సినిమాల నుంచి తొలగించారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే వివాదాలతో నిత్యం వార్తలలో నిలిచింది. కట్ చేస్తే.. రూ.2800 కోట్ల ఆస్తులు ఉన్న ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుసగా పోస్టులు చేస్తుంది. ఆమె మరెవరో కాదు.. హిందీ హీరోయిన్ శిల్పా శెట్టి. దశాబ్దాలుగా సినీరంగంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.

చాలా సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్నత స్థానంలో నిలబడం అంత సులభం కాదు. ముఖ్యంగా హీరోయిన్లకు చాలా కష్టం. ఫిట్నెస్, గ్లామర్ రెండింటి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బాడీ షేమింగ్, సవాళ్లు, కష్టాలను నవ్వుతూనే ఎదుర్కొవాల్సి ఉంటుంది. హిందీ, తెలుగు, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది శిల్పా శెట్టి. కానీ కెరీర్ ప్రారంభంలో ఆమెకు తెలియకుండానే ఆమెను పలు సినిమాల నుంచి తొలగించారు. దార్, ఇండియన్, షూన్, మెయిన్ ఖిలాడీ తూ అనారీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అక్షయ్ కుమార్ తో శిల్పా శెట్టి ప్రేమలో ఉన్నట్లు ప్రచారం నడిచింది. కానీ వీరిద్దరు కొన్నాళ్లకే విడిపోయారు. ఆ తర్వాత వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. అతడి ఆస్తులు రూ.2800 కోట్లు.. శిల్పా శెట్టి అత్యంత ధనిక హీరోయిన్లలో ఆమె ఒకరు. ఆమె ఆస్తులు రూ.340 కోట్లు. ఇక రాజ్ కుంద్రా పలు వివాదాలతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే సినీనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..