Prabhas: డార్లింగ్ కార్ కలెక్షన్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. ప్రభాస్ లైఫ్ స్టైల్ చూస్తే ఫిదా కావాల్సిందే..

|

Oct 20, 2024 | 7:28 PM

ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ హీరోకు వరల్డ్ వైడ్ ఓ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న హీరో డార్లింగ్ . జక్కన్న రూపొందించిన బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‏కు క్రేజ్ మారిపోయింది. మేడమ్ టుస్సాడ్ మైనపు మ్యూజియంలో మైనపు విగ్రహం ఉన్న తొలి దక్షిణాది నటడు ప్రభాస్ కావడం విశేషం.

Prabhas: డార్లింగ్ కార్ కలెక్షన్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. ప్రభాస్ లైఫ్ స్టైల్ చూస్తే ఫిదా కావాల్సిందే..
Prabhas
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డార్లింగ్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా విడుదలవ్వగానే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు ప్రభాస్. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. హారర్ కామెడీ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో వింటెజ్ ప్రభాస్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఇప్పటికే విదేశాల్లో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో డార్లింగ్ హిట్ మూవీస్ ఈశ్వర్, సలార్, మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రాలు మరోసారి రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోలలో ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ క్రేజ్ మారిపోయింది. మేడమ్ టుస్సాడ్ మైనపు మ్యూజియంలో విగ్రహం ఉన్న తొలి హీరో ప్రభాస్ కావడం విశేషం. అలాగే ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు.

నివేదికల ప్రకారం ప్రభాస్ ఆస్తి ఇప్పటివరకు రూ.240 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అలాగే ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు దాదాపు రూ.2 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న తన అభిమానుకు సాయం చేయడంలో ముందుంటారు ప్రభాస్. అంతేకాకుండా షూటింగ్ సెట్ లో ప్రతిఒక్కరికి ఇంటి భోజనం అందిస్తాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రభాస్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ వద్ద ఉన్న కార్ కలెక్షన్ గురించి నెట్టింట ఆరా తీస్తున్నారు.

ఇది చదవండి : OTT Movie: అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. మైథిలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

ప్రభాస్ వద్ద ప్రస్తుతం రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. దీని విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుంది. అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అమితాబ్ వద్ద కూడా ఈ కారు ఉంది. అలాగే రూ.2.08 కోట్ల విలువైన జాగ్వార్ XJR కారు ఉంది. ఈ స్వాంకీ జాగ్వార్ కారును ఇటీవల కార్తీకేయ నటించిన భజేవాయువేగం సినిమాకు ఉపయోగించారు. రూ.1 కోటి విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు కూడా ఉంది. ఇవే కాకుండా ప్రభాస్ గ్యారేజీలో రూ.6 కోట్లు ఖరీదైన లాంబోర్గినీ అవెంటడోర్ రోడ్‌స్టర్, రూ.68 లక్షల విలువైన BMW X3 ఉన్నాయి.

 

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.