
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది వందల కోట్లు సొంతం చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి వాటిలో ఈ సినిమా ఒకటి. కేవలం రూ. 6కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది . బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు రాబట్టింది. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.? ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ సినిమా.. అలాగే ఈ సినిమాలో నటించిన వారందరూ స్టార్ హీరోలే.. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.?
తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకుంటున్నాయి. కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక హిందీలో తెరకెక్కిన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఈ మూవీ ఒకటి ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.6కోట్లు కానీ సినిమా రాబట్టింది మాత్రం రూ.128కోట్లు రాబట్టింది. ఆ సినిమా మరేదో కాదు.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హమ్ ఆప్కే హై కౌన్. ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ చేశారు.
హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించారు. ఈ సినిమా బాలీవుడ్ ను షేక్ చేసింది. బాలీవుడ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సినిమాలను వెనక్కి నెట్టింది. 1994లో ఈ సినిమా నెం.1గా నిలిచింది ఈ సినిమా. ఇప్పటికీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా హమ్ ఆప్కే హై కౌన్ ఉంది. ఆ ఏడాది విడుదలైన అన్ని సినిమాల రికార్డ్స్ ను అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ను ఈ సినిమా బీట్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.